Lenin Movie: ఇంట్లో భార్యను అఖిల్ ఏమని పిలుస్తాడో తెలుసా? జైనబ్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన అక్కినేని హీరో

బుధవారం (జులై 15) గుంటూరు వేదికగా నిర్వహించిన లెనిన్ సక్సెస్ మీట్ కు అఖిల్ అక్కినేని సతీమణి జైనబ్ కూడా హాజరైంది. ఈ సందర్భంగా మాట్లాడిన తన భార్య గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు. అలాగే తన తండ్రి నాగార్జున గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు.

Lenin Movie: ఇంట్లో భార్యను అఖిల్ ఏమని పిలుస్తాడో తెలుసా? జైనబ్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన అక్కినేని హీరో
Akhil Akkineni Lenin Movie

Updated on: Jul 16, 2026 | 2:00 PM

అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ సినిమా లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటించింది. జులై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి వంద కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. కాగా లెనిన్ సినిమా సక్సెస్ పట్ల హీరో అఖిల్ తో పాటు చిత్ర బృందమంతా సంతోషంలో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం (జులై 15) లెనిన్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు. గుంటూరు వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి అఖిల్, భాగ్యశ్రీతో సహా చిత్ర బృందమంతా హాజరైంది. అలాగే అఖిల్ భార్య జైనబ్ కూడా మొదటి సారిగా ఓ సినిమా ఈవెంట్ కు హాజరైంది. ఈ సందర్భంగా మాట్లాడిన అఖిల్ తన భార్య గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు. అలాగే తనకు ఒక మంచి సాలిడ్ హిట్ అందించేందుకు నాగార్జున పడిన కష్టాన్ని కూడా అందరితో పంచుకున్నాడు అఖిల్.

‘నేను జైనబ్‌ను ఇంట్లో బంగారు తల్లి అని పిలుస్తాను. మూడేళ్లుగా నేను బాధలో ఉన్నప్పుడు తను నా ఉంది. అనుక్షణం నాకు ఎంతో సపోర్ట్‌ చేసింది. ఓ మార్గదర్శిలా ఉంటూ నాకు ధైర్యాన్నిచ్చింది. ఇక లెనిన్‌ విడుదలైన అనంతరం జరిగిన ఈవెంట్‌లో నేను నాన్నను హగ్ చేసుకున్నాను. అందులోనే నేను పదేళ్లుగా దాచుకున్న ఎమోషన్స్‌ అన్నీ బయటకు వచ్చాయి. ఇన్నేళ్లలో నాన్న నన్ను ఒక్కసారి కూడా తిట్టలేదు. నిరుత్సాహపర్చలేదు. నాకు సర్వస్వం ఆయనే. ఒక ఫ్రెండ్‌లా ఈ జర్నీలో నాకు తోడుగా నిలిచాడు నాన్న. ‘లెనిన్‌’ను తన భుజాలపై మోశాడు. అక్కినేని అభిమానులకు మంచి సినిమాను అందించాలనే తపనతో వర్క్‌ చేశాడు’ అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు అఖిల్. ప్రస్తుతం లెనిన్ సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్ లో అఖిల్ అక్కినేని – జైనబ్ కలిసున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

లెనిన్ సినిమా సక్సెస్ ఈవెంట్ లో అఖిల్ అక్కినేని, జైనబ్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us