ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించగా.. డైరెక్టర్ రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారు. పాన్ ఇండియా లెవల్లెనో కాకుండా.. విదేశాల్లోనూ ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబట్టింది. అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది. తాజాగా రామ్ చరణ్.. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొనడానికి అమెరికాకు వెళ్లారు. ఈ క్రమంలోనే అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన టాక్ షో గుడ్ మార్నింగ్ అమెరికా 3లో పాల్గొన్నారు రామ్ చరణ్. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
గుడ్ మార్నింగ్ అమెరికా 3 షోకు హాజరైన మొదటి తెలుగు స్టార్ అయిన చరణ్.. గ్రే బ్లేజర్, మ్యాచింగ్ ట్రౌజర్ ధరించి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అలాగే బ్రౌన్ షూస్.. సన్ గ్లాసెస్ తో ఫుల్ స్మార్ట్ లుక్ లో అదిరిపోయాడు చెర్రీ. ఈ టాక్ షోలో పాల్గొనడానికి వెళ్తున్న చెర్రీ అమెరికా అభిమానులకు ఘన స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో ఫ్యాన్స్ రోడ్స్ పైకి వచ్చి చెర్రీతో సెల్ఫీ తీసుకునేందుకు ట్రై చేయగా.. చరణ్ అభిమానులతో సెల్పీ తీసుకున్నారు. అలాగే గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో పాల్గొన్నారు చరణ్..
ఇప్పటివరకు ఈ ప్రతిష్టాత్మకమైన టాక్ షోలో పాల్గొన్న తొలి తెలుగు హీరోగా అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు చరణ్. గతంలో ఈ టాక్ షోలో ప్రియాంక చోప్రా అనేక సార్లు పాల్గొనగా… తెలుగు నుంచి మొదటి సారిగా రామ్ చరణ్ కు స్వాగతం పలికారు. ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ గురించి.. నాటు నాటు సాంగ్.. కీరవాణి అద్భుత సంగీతం ఆసక్తికర కామెంట్స్ చేశారు చెర్రీ.
అలాగే చరణ్.. 6వ వార్షిక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్ వేడుకలలో పాల్గొననున్నారు. ఫిబ్రవరి 24న ఈ అవార్డ్ ప్రధానోత్సవం జరగనుంది. ఇక హెచ్ సి.ఏ అవార్డులలో ఆర్ఆర్ఆర్ నాలుగు విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఉత్తమ సినిమా.. ఉత్తమ దర్శకత్వం.. అంతర్జాతీయ సినిమా.. యాక్షన్ ఫిల్మ్ విభాగాల్లో హాలీవుడ్ సినిమాతోపాటు.. ట్రిపుల్ ఆర్ చిత్రం కూడా పోటి పడనుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.