ప్రముఖ సీనియర్ నటి వాణి శ్రీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తనయుడు అభినయ్ వెంకటేష్ నిద్రలోనే అనుమానాస్పద రీతిలో కన్నుమూశాడు. పోలీసులు ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. బెంగళూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు అభినవ్. ఇటీవలే తమిళనాడుకు వచ్చి క్వారంటైన్ లో ఉంటున్నారు. కాగా అభినయ్ అనుమానాస్పద మరణంపై తిరుప్పర గుండ్రమ్ పీఎస్ లో కేసు నమోదైంది. కాగా అలనాటి నటి వాణిశ్రీకి ..కుమారుడు అభినయ్తో పాటు కుమార్తె అనుపమ ఉన్నారు. కుమారుడు హఠాన్మరణంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమెకి సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.