తిరుమల శ్రీవారి సన్నిధిలో మిల్కీ బ్యూటీ..! చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదట

అందాల భామ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు కంటే రీసెంట్ డేస్ లో బాలీవుడ్ సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. తెలుగులో ఓదెల 2లో కనిపించింది. ఆతర్వాత తిరిగి సినిమాలు చేయలేదు. కానీ హిందీలో మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

తిరుమల శ్రీవారి సన్నిధిలో మిల్కీ బ్యూటీ..! చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదట
Tamannaah

Updated on: Oct 07, 2026 | 1:25 PM

స్టార్ హీరోయిన్ తమన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆమె.. సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. దర్శనం తర్వాత ఆలయం బయట మీడియాతో మాట్లాడిన తమన్నా.. తిరుమల దర్శనం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని అన్నారు. తాను చిన్నప్పటి నుంచే తిరుమలకు వస్తున్నానని తెలిపిన తమన్నా.. ఈసారి జరిగిన దర్శనం మాత్రం తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందన్నారు. చాలా రోజుల తర్వాత తిరుమలకు వచ్చినట్లు చెప్పిన ఆమె.. స్వామివారి దర్శనం ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా జరిగిందని పేర్కొన్నారు.

‘‘చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. దర్శనం చాలా బాగా జరిగింది. అందరి కోసం ప్రార్థించాను. ఇక్కడికి వస్తే ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది. చాలా తృప్తిగా, లక్కీగా ఫీల్ అవుతున్నాను. చిన్నప్పటి నుంచి తిరుమలకు వస్తున్నాను. కానీ ఈరోజు జరిగిన దర్శనం లాంటిది ఇప్పటివరకు చూడలేదు’’ అని తమన్నా చెప్పుకొచ్చారు.

తమన్నా తిరుమల కు వచ్చిన ఫోటోలు, వీడియోలు  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాధారణంగా సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే ఆమె.. సమయం దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూ ఉంటారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో చివరిగా ‘ఓదెల 2’ సినిమాలో తమన్నా కనిపించారు. ఈ సినిమా తర్వాత ఆమె ప్రస్తుతం హిందీ, తమిళ చిత్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ దూసుకుపోతున్నారు తమన్నా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us