ప్రస్తుతం సెలబ్రెటీలకు.. అభిమానులకు మధ్య వారధిగా ఉంది సోషల్ మీడియా. ఎప్పటికప్పుడు తమ లేటేస్ట్ ఫోటోస్, పర్సనల్ విషయాలు.. మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్ లో ఉంటున్నారు. అంతేకాకుండా.. లైవ్ వీడియోస్ ద్వారా ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తుంటారు. అయితే కొన్నిసార్లు నెటిజన్స్ నుంచి అనుకొని ప్రశ్నలు ఎదురవుతుంటారు. అవసరం లేని.. కించపరుస్తూ కామెంట్స్ చేస్తుంటారు. అయితే వాటికి అందరూ నటీనటులు రియాక్ట్ అవ్వరు. కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే తమదైన శైలీలో ఆన్సర్ ఇస్తుంటారు. ఇటీవల ఓ నెటిజన్ ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది రష్మిక మందన్న. తాజాగా హీరోయిన్ శ్రుతి హాసన్ ఓ నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది.
కమల్ హాసన్ వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతి హాసన్. కొన్నిరోజుల గ్యాప్ అనంతరం ఇటీవల క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ లైఫ్ గడిపేస్తుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది శ్రుతిహాసన్. తాజాగా గురువారం ఇన్ స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు శ్రుతిహానస్. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. శ్రుతి.. ఇప్పటివరకు మీ జీవితంలో ఎన్ని బ్రేకప్స్ ఉన్నాయి ? అని ప్రశ్నించాడు. దీంతో వెంటనే మీకెంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ? అని రివర్స్ ప్రశ్నించింది శ్రుతి. నీకు ఎంతమంది లవర్స్ ఉన్నారు ? నువ్వు ప్రశ్నలు అడిగిన విధానం బట్టి చూస్తే నీకసలు లవర్ లేదని నా అభిప్రాయం అంటూ కౌంటరిచ్చింది శ్రుతిహాసన్. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో నటిస్తోంది. అలాగే గోపిచంద్ మలినేని, బాలకృష్ణ కలయికలో రాబోతున్న సినిమాలోనూ నటిస్తోంది.
Also Read: Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‌తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..
Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!
Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..