
ప్రముఖ టాలీవుడ్ నటి సమంత మళ్లీ రంగంలోకి దిగింది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న ఆమె తన లేటెస్ట్ సినిమా యశోద ప్రమోషన్ల కోసం సిద్ధమైంది. అనారోగ్య పరిస్థితులతో శరీరం సహకరించేలేకపోయినా సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను తీసుకుంది. ఈ మేరకు సమంత షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకున్న సమస్యను ప్రకటించినప్పుడు కూడా మొహం చూపించని సామ్ తాజా ఫొటోల్లో చాలా బలహీనంగా కనిపిస్తోంది. అయితే హెల్త్ కండీషన్ సరిగా లేకున్నా సినిమా కోసం సామ్ డెడికేషన్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. సమంత ప్రధాన పాత్రలో పోషిస్తోన్న యశోద నవంబర్ 11న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సరోగసీ నేపథ్యంలో హరి- హరీశ్ సంయుక్తంగా ఈ థ్రిల్లర్‌ను రూపొందించారు. ఈ సినిమాలో ఉన్నీ ముకుందన్, వరలక్ష్మి, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితర ప్రముఖులు నటిస్తున్నారు.
కాగా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. అయితే అనారోగ్యం కారణంగా సామ్ ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటుందనుకున్నారు. మయోసైటిస్‌తో బాధపడుతున్న సామ్ అందుకు తగిన చికిత్స తీసుకుంటుంది. అయితే సినిమా సకాలంలో పూర్తి చేయాలని భావించి డాక్లర్ల పర్యవేక్షణలో సెలైన్ పెట్టుకొని మరీ డబ్బింగ్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని యశోద నిర్మాతే స్వయంగా తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె బయటకు రావడం దాదాపు కష్టమే అని నిర్మాతలు సహా చాలామంది అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్వర్యపరుస్తూ సమంత యశోద ప్రమోషన్స్‌కు సిద్ధమైంది .
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..