న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి (Sai Pallavi) ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇక తన సహజనటనతో తెలుగు ఆడియన్స్ను ‘ఫిదా’ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే విరాట పర్వం సినిమాతో అలరించింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన గార్గి సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇందులో సాయి పల్లవి మరోసారి తన నటవిశ్వరూపం చూపించింది. తండ్రిని కాపాడుకోవడానికి పోరాటం చేసే కూతురి పాత్రలో ఆమె నటనకు సినీ విమర్శకులు ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా గార్గి సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది న్యాచురల్ బ్యూటీ. తెరపై గార్గి సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఆకస్మాత్తుగా కళ్లముందుకు సాయి పల్లవి రావడంతో ఆశ్చర్యపోయారు.
సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన గార్గి సినిమా జూలై 15న విడుదలైంది. తమిళంతోపాటు.. తెలుగులోనూ మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే చెన్నై, హైదరాబాద్ లలోని పలు థియేటర్లను సందర్శించారు. సినిమా పూర్తయ్యే సమయానికి థియేటర్ లోపలికి వెళ్లి వాళ్లను సర్ ప్రైజ్ చేశారు. అయితే సాయి పల్లవి సడెన్ ఎంట్రీ కాకుండా.. వాళ్ల ఆనందాన్ని, అభిమానంతో ఆమె ఎమోషనల్ అయ్యింది. అలాగే ఆమె నటనకు ప్రశంసలు కురిపించారు. అభిమానులతో ఫోటోలు దిగింది సాయి పల్లవి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సాయి పల్లవిని ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే.
#SaiPallavi‘s Surprise theatre visit..❣️ A deserving response..?#Gargipic.twitter.com/bJ0SRvCCaR
— Laxmi Kanth (@iammoviebuff007) July 17, 2022
Beautiful #SaiPallavi interacts with audience at theater in Hyderabad @ArtistryBuzz @Sai_Pallavi92 pic.twitter.com/TMLfv5OUnI
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) July 18, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.