ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలు అనుకున్నా.. కానీ అమ్మవారి దయతో ఊహించనిది జరిగింది

రేణూ దేశాయ్.. పరిచయం అక్కర్లేని పేరు. నటిగా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు రేణూ దేశాయ్. ఇటీవలే సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన రేణూ దేశాయ్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. సినిమాలతో పాటు సామజిక సమస్యల పై గొంతు విప్పుతూ ఉంటారు రేణూ దేశాయ్

ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలు అనుకున్నా.. కానీ అమ్మవారి దయతో ఊహించనిది జరిగింది
Renu Desai

Updated on: Nov 20, 2026 | 12:04 PM

ప్రముఖ నటి రేణు దేశాయ్ ఓం చిత్రంతో నటిగా తిరిగి వెండితెరపై రాణిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సరసన ప్రధాన పాత్రలో నటించారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ తన రీఎంట్రీ, ఆరోగ్య రహస్యాలు, మమ్ముట్టితో కలిసి పనిచేసిన అనుభవం, ఆ అవకాశాన్ని పొందిన వైనం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రేణు దేశాయ్ సాధారణంగా పిల్లులు, కుక్కలతో, కాశీ యాత్రలలో, లేదా టపాకాయల శబ్దాలపై ఫిర్యాదు చేస్తూ సోషల్ మీడియాలో కనిపించే వ్యక్తిగా పరిచయం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఓం చిత్రంతో నటిగా తిరిగి రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఓం చిత్రం తన కమ్‌బ్యాక్‌కు సరైన వేదిక అని ఆమె అభిప్రాయపడ్డారు. తన ఫ్రెష్ నెస్ వెనుక ఉన్న రహస్యాన్ని రేణు దేశాయ్ వెల్లడించారు. గత ఏడాది జరిగిన ఒక శస్త్రచికిత్స కారణంగా దాదాపు ఆరు నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవలసి వచ్చిందని ఆమె చెప్పారు. జూన్ నుండి డిసెంబర్ వరకు విశ్రాంతి తీసుకున్న ఈ సమయంలో ఆమె ఆహార నియమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారట. కిచిడి, పెసరపప్పు కిచిడి, సొరకాయ, బీరకాయ వంటి తేలికపాటి, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకున్నారు. ఈ ఆహార విధానం, విశ్రాంతి కారణంగా శరీరంలో పేరుకుపోయిన వాపు తగ్గిపోయిందని, అందుకే తాను మరింత ఫ్రెష్‌గా, ఆరోగ్యంగా కనిపిస్తున్నానని రేణు దేశాయ్ వివరించారు.

మమ్ముట్టి వంటి లెజెండరీ నటుడితో నటించే అవకాశం లభించడం పట్ల రేణు దేశాయ్ తన ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది తాను మమ్ముట్టి సినిమాలను చూస్తున్నప్పుడు, ఒకరోజు ఆయనను కలవాలని, ఆయనతో కలిసి ఒక ఫ్యాన్ పిక్చర్ దిగాలని మాత్రమే అనుకున్నానని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆయన స్థాయికి, తన స్థాయికి చాలా తేడా ఉందని, ఆయనతో నటించడం తనవల్ల కాదని భావించానన్నారు. అయితే విధి విచిత్రంగా మహాశివరాత్రి రోజున ఆమెకు ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించిందని రేణు దేశాయ్ వివరించారు.

మహాశివరాత్రి రోజున తాను కామాఖ్య దేవాలయంలో ఉన్నానని, ఆ సమయంలో చెన్నై నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి తనకు కాల్ వచ్చిందని, మమ్ముట్టి 55వ చిత్రంలో ఆయన సరసన భార్య పాత్రకు ఆఫర్ చేశారని తెలిపారు. మొదట తాను దీన్ని ఒక ప్రాంక్ అనుకున్నానని, నమ్మడానికి చాలా సమయం పట్టిందని ఆమె అన్నారు. ఆ తర్వాత రెండు నెలలకు చిత్రానికి ఓం అనే పేరు ప్రకటించినప్పుడు తనకు గూస్‌బంప్స్ వచ్చాయని, ఇదంతా అమ్మవారి అనుగ్రహమని ఆమె నమ్మారు. తన పిల్లలు అకిరా, ఆధ్యల స్పందన, సోషల్ మీడియా ట్రోలింగ్, వ్యక్తిగత గుర్తింపు, క్షమ, కృతజ్ఞత వంటి జీవిత పాఠాలపై కూడా ఆమె వివరించారు. ఈ అనుభవం ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us