Ramaprabha: అంతటి అందం, గుణం, ఆడతనం ఉన్న హీరోయిన్‌ని నేను ఇంతవరకూ చూడలేదు..

అందం, నటన, వినయం అన్నీ సమపాళ్లలో ఉన్న అరుదైన నటి ఆమె అంటూ రమాప్రభ ప్రశంసలు కురిపించారు. రమాప్రభ ఏ విషయాన్ని అయినా నాన్చకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. ఇంతకీ ఆమె అంతలా ప్రశంసలు కురిపించింది ఎవరిపైనో తెలుసుకుందాం పదండి ,,

Ramaprabha: అంతటి అందం, గుణం, ఆడతనం ఉన్న హీరోయిన్‌ని నేను ఇంతవరకూ చూడలేదు..
Actress Ramaprabha

Updated on: Mar 28, 2026 | 12:05 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు నటి రమాప్రభ. ఆమె ఎంతో సీనియర్ నటి.. అటు పెద్ద ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు 3 జనరేషన్స్ హీరోలతో కలిసి యాక్ట్ చేశారు. ఇక తన అభిప్రాయాలను కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు రమాప్రభ. ఆమె దివంగత నటి సౌందర్య గురించి చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సహజంగా పెట్టిన పేరుకు విరుద్దంగా చాలామంది ప్రవర్తిస్తారని.. వాళ్ల జీవితాల్లో కూడా అలా జరుగుతుందని.. కానీ పెట్టిన పేరుకు సార్థకత ఉన్న పర్సన్ సౌందర్య అని చెప్పుకొచ్చారు. తన తర్వాత జనరేషన్స్‌లో నటన, అందం, ప్రవర్తన, ప్రేమతత్వం, ఆడతనం.. ఇవన్నీ సమపాళ్లలో ఉన్న నటి సౌందర్య అంటూ ప్రశంసించారు. తను సెట్స్‌లో బుక్స్ చదువుతూ ప్రశాంతంగా ఉంటుందని.. ఎవర్నీ పట్టించుకోదని చెప్పుకొచ్చారు. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని వివరించారు. ఓసారి తనతో షాపింగ్ వెళ్లిన అనుభవాన్ని కూడా రమాప్రభ పంచుకున్నారు. తను ఎలాంటి కాస్మోటిక్స్ కొనలేదని.. ఇంటి చిట్కాలే పాటిస్తానని చెప్పికొచ్చినట్లు  తెలిపారు. తను చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటుందని.. పర్సనల్ లైఫ్ గురించి ఏం షేర్ చేసుకోదని రమాప్రభ వివరించారు.  సౌందర్య తర్వాత అంత అందం, ఆడతనం ఉన్న హీరోయిన్‌ని తాను చూడలేదని రమాప్రభ చెప్పుకొచ్చారు.

కెరీర్ తొలినాళ్లలో స్రవంతి గెస్ట్ హౌస్‌ అనే చోట సౌందర్య బస చేసేవారని.. ఆమె అగ్రస్థాయి నటిగా మారినా.. అక్కడే స్టే చేసిందని.. ఫైవ్ స్టార్, సెవన్ స్టార్ హోటల్స్‌కి షిఫ్ట్ కాలేదని రమాప్రభ వివరించారు. ఈ రోజుల్లో హీరోయిన్ ట్యాగ్ వేసుకుని చాలామంది చాలా రకాలుగా ప్రవర్తిస్తున్నారని.. సౌందర్యకు ఆ అహం ఏం లేదని చెప్పుకొచ్చారు. సౌందర్య చనిపోయాక.. ఆ రూమ్‌కి సౌందర్య రూమ్ అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. అంత:పురం సినిమా తాను 60, 70 సార్లు చూశానని.. ఎప్పుడూ చూసిన సౌందర్య నటన చూసి ఆశ్చర్యం వేసేదని చెప్పుకొచ్చారు. ఆమె డ్రస్సింగ్ అంటే తనకు చాలా ఇష్టమని సౌందర్య అనే పేరుకు సార్థకత చేసిన మహిళ ఆమె అని కొనియాడారు.

Soundarya

 

Also Read: రూ.3 కోట్ల బడ్జెట్.. ఎన్టీఆర్ మాస్ హిట్ ‘ఆది’ ఎంత వసూలు చేసిందో తెలిస్తే నివ్వెరపోవాల్సిందే.. 

 

Loading...
Unable to load recommendations.
Follow Us