Rakul Preet Singh: ‘నాకు ఏ వ్యక్తితో సంబంధం లేదు.. నా పేరు వాడుకోవడం మానేయండి’.. రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్..

|

Oct 03, 2024 | 6:30 PM

ఇప్పటికే సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ కాగా.. తాజాగా అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో కొండ సురేఖపై పరువునష్టం దావా వేశారు. తమ కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొండ సురేఖ నిరాధారమైన వ్యాఖ్యులు చేశారని.. ఆమె పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Rakul Preet Singh: నాకు ఏ వ్యక్తితో సంబంధం లేదు.. నా పేరు వాడుకోవడం మానేయండి.. రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్..
Rakul Preet Singh
Follow us on

తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి. అక్కినేని నాగచైతన్య, సమంత డివోర్స్ గురించి ఆమె చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ ఇండస్ట్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ కాగా.. తాజాగా అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో కొండ సురేఖపై పరువునష్టం దావా వేశారు. తమ కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొండ సురేఖ నిరాధారమైన వ్యాఖ్యులు చేశారని.. ఆమె పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా కొండ సురేఖ వ్యాఖ్యలపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. తమ రాజకీయాల కోసం తన పేరును వాడుకోవడం ఆపేయాలని.. గౌరవం కోసం మాట్లాడుకుండా ఉంటే దానిని బలహీనతగా చూస్తున్నారని తెలిపింది.

“తెలుగు చలనచిత్ర పరిశ్రమ దాని సృజనాత్మకత, వృత్తి నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నేను ఈ అందమైన పరిశ్రమలో గొప్ప ప్రయాణం చేసాను. ఇప్పటికీ ఈ ఇండస్ట్రీతో చాలా కనెక్ట్ అయ్యాను. ఇలాంటి పరిశ్రమలో మహిళల గురించి నిరాధారమైన దుర్మార్గపు పుకార్లు ప్రచారం చేయడం బాధాకరం. మరింత నిరుత్సాహపరిచే విషయం ఏమిటంటే, చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మనసు విరిచేసేలా ఉంది.

గౌరవం కోసం, మనం మౌనంగా ఉండటాన్ని ఎంచుకుంటాము. కానీ అది మన బలహీనతగా తప్పుగా భావిస్తున్నారు. నేను పూర్తిగా రాజకీయ వ్యతిరేకిని. నాకు ఏ వ్యక్తి/ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. నా పేరును ఇలా హానికరమైన రీతిలో ఉపయోగించడం మానేయమని నేను కోరుతున్నాను. రాజకీయ మైలేజీ కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం మానేయండి. ఆర్టిస్టులను ఈ రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలి. రాజకీయ విమర్శలు, న్యూస్ హెడ్ లైన్స్ కోసం అర్థంలేని కథలలో మా పేర్లు వాడుకోవడం మానేయండి” అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.