Pranitha Subhash : హీరోయిన్ ప్రణీత కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూడండి.. బుజ్జిది ఎంత ముద్దుగా ఉందో..

ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన ఈ భామ. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే తన స్నేహితుడు ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ప్రణీత..

Pranitha Subhash : హీరోయిన్ ప్రణీత కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూడండి.. బుజ్జిది ఎంత ముద్దుగా ఉందో..
Pranitha

Updated on: Nov 08, 2022 | 4:09 PM

ప్రణీత సుభాష్.. టాలీవుడ్ లో ఈ చిన్నది పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన ఈ భామ. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే తన స్నేహితుడు ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ప్రణీత. ఇటీవలే ప్రణీత కు బిడ్డకు జన్మనిచ్చింది. పాప పుట్టిన తర్వాత ప్రణీత పూర్తిగా తన టైం ను తనతో గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది. పాప ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

అయితే తాను పోస్ట్ చేసిన ఫొటోల్లో ఎప్పుడు పాప మొఖం కనిపించకుండా లవ్ ఎమోజీలు పెట్టేది ప్రణీత. అయితే తాజాగా షేర్ చేసిన ఫొటోస్ లో పాప మొఖం కనిపించేలా పోస్ట్ చేసింది. ఆ బుజ్జిది చాలా క్యూట్ గా ఉంది. ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫోటో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అచ్చం ప్రణీతలనే ఉంది అని అంటున్నారు కొందరు. మరికొంతమంది ప్రణీత కూతురు చాలా క్యూట్ గా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడే ఇంత పెద్దది అయ్యిందా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు పలువురు.

ఇవి కూడా చదవండి

Pranitha With Baby

 

Loading...
Unable to load recommendations.
Follow Us