Pooja Hegde: పూజాహెగ్డేకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే స్టార్ హీరో అతనే..

గ్రాఫ్‌ ఎంత పీక్స్‌లో నడుస్తున్నా.. సక్సెస్‌ స్ట్రీక్ కంటిన్యూ కాకపోతే కెరీర్‌ ఒక పెద్ద క్వశ్చన్‌మార్కే అవుతుంది. ఇప్పుడు పూజా మేడమ్ పరిస్థితి కూడా దాదాపుగా అలాగే వుందట.

Pooja Hegde: పూజాహెగ్డేకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే స్టార్ హీరో అతనే..
Pooja Hegde
Rajeev Rayala

|

Apr 30, 2022 | 9:43 AM

గ్రాఫ్‌ ఎంత పీక్స్‌లో నడుస్తున్నా.. సక్సెస్‌ స్ట్రీక్ కంటిన్యూ కాకపోతే కెరీర్‌ ఒక పెద్ద క్వశ్చన్‌మార్కే అవుతుంది. ఇప్పుడు పూజా(Pooja Hegde) మేడమ్ పరిస్థితి కూడా దాదాపుగా అలాగే వుందట. బుట్టబొమ్మ అనే బ్రాండ్ నేమ్‌తో పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎలివేటైన పూజా హెగ్డేకి.. ఆ ఎలివేషన్‌ని మొయ్యడం ఇప్పుడొక భారంగా మారింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ హిట్టయ్యాక చిన్నహీరోలక్కూడా లక్కీ మస్కట్‌నే అని ప్రౌడ్‌గా ఫీలయ్యారు పూజా హెగ్డే. అక్కినేని హీరోకి తన చేతులతో బ్రేక్ ఇచ్చి.. అదే దూకుడు మిగతా చోట్ల కూడా కంటిన్యూ చేస్తానన్న కాన్ఫిడెన్స్‌ కలిగించారు ఫ్యాన్స్‌లో. కాకపోతే.. ప్రేరణ క్యారెక్టర్ పూజాఫలం కాన్సెప్ట్‌ని అడ్డం తిప్పేసింది. రాధేశ్యామ్‌ భారీ డిజాస్టర్‌ కావడం పూజా హెగ్డే కమర్షియల్ వెయిట్ మీద డౌట్లు పుట్టించేసింది. ఆ వెంటనే కోలీవుడ్‌ నుంచి కూడా షాకింగ్ న్యూసే వినాల్సి వచ్చింది. బీస్ట్ మూవీలో ఉండీ లేనట్టుండే పూజా క్యారెక్టర్‌ని ఆడియన్స్‌ లైట్ తీస్కున్నారు. ఆ సినిమా కూడా ఫెయిల్యూర్స్ జాబితాలో కలిసిపోయిది.

బ్యాక్‌టుబ్యాక్‌ బ్యాడ్‌న్యూస్ వింటూ వస్తున్న పూజా హెగ్డే.. ఆచార్య మీద హోప్స్ పెట్టుకున్నారు. బ్యాడ్ సెంటిమెంట్‌ కంటిన్యూ కాకూడదని, పూజాకు హ్యాట్రిక్‌ మిస్ కావాలని మెగా ఫ్యాన్స్‌ కూడా పూజలూ పునస్కారాలూ చేశారు. రీసెంట్ గా రిలీజైన ఆచార్య తుది ఫలితం ఎలా వున్నా అందులో నీలాంబరి పార్ట్ మీద మాత్రం నెగిటివిటీ వచ్చేసింది. ఆమె రోల్ నీడ్‌లెస్‌గా, అన్‌ఫినిష్‌డ్‌గా ఉందన్నది ఫస్ట్‌ రివ్యూ. నిజానికి.. నీలాంబరి పాట తప్పితే.. ఆచార్యలో పూజ ఉనికే లేదు. ప్రస్తుతానికి టాలీవుడ్‌లో బుట్టబొమ్మ తాజా ఇన్నింగ్స్ ముగిసినట్టే. ఈ క్యాలెండర్‌లో ఇస్తేగీస్తే బీటౌన్‌లోనే సౌండివ్వాలి. ఆ తర్వాత మళ్లీ తెలుగులో సూపర్‌స్టార్‌తోనే కొత్త ఇన్నింగ్స్ మొదలౌతోంది. మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబోలో రాబోయే హ్యాట్రిక్ మూవీ.. పూజాహెగ్డేకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నటిపై అత్యాచారం కేసులో ట్విస్ట్.. మరో మహిళ ఆరోపణలతో మలయాళీ నటుడిపై రెండో కేసు నమోదు..

Bollywood vs Sandalwood: లాంగ్వేజ్‌ లడాయి.. పొలిటికల్ టర్న్ తీసుకున్న హిందీ భాష వివాదం..

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే న్యూస్ చెప్పిన సర్కారు వారి పాట ఎడిటర్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu