Actress : అప్పుడు ప్రభాస్ సినిమాలో గ్లామర్ క్వీన్.. 12 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్..

దక్షిణాది సినిమా ప్రపంచంలో ఒకప్పుడు అందం, అభినయంతో కట్టిపడేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన తారలు.. ఇప్పుడు ఒక్కోక్కరిగా రీఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ సినీరంగంలో తిరిగి సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Actress : అప్పుడు ప్రభాస్ సినిమాలో గ్లామర్ క్వీన్.. 12 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్..
Prabhas, Namitha

Updated on: Dec 26, 2025 | 8:25 AM

సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలలో నమిత ఒకరు. అప్పట్లో తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సరసన నటించి వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంది. ఈ అమ్మడు ఒకప్పుడు యూత్ ఆరాధ్య దేవత. తెలుగులో ఆర్యన్ రాజేశ్ నటించిన సొంతం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాతోనే నటిగా సూపర్ హిట్ అందుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత జెమిని, ఐతే ఏంటీ !, నాయకుడు వంటి చిత్రాల్లో నటించింది. అలాగే ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో గ్లామరస్ బ్యూటీగా కనిపించింది. అలాగే బాలకృష్ణ నటించిన సింహా సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది. వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది నమిత. 2010 తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. కానీ మిగతా భాషలలో ఆడపాదడప చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి : Actress Srilakshmi : 500లకు పైగా సినిమాలు.. ఈ నటి మేనకోడలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. 300 కోట్లు కొల్లగొట్టింది..

ఇదిలా ఉంటే.. చాలా కాలం తర్వాత తిరిగి అడియన్స్ ముందుకు వచ్చింది నమిత. ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్న నమిత.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపింది. అలాగే గతంలో చేసిన తప్పులను సైతం మళ్లీ రిపీట్ చేయనని అంటుంది. అందుకోసమే కొన్ని కథలు నచ్చకపోతే ఎలాంటి మొహమాటం లేకుండా రిజెక్ట్ చేస్తున్నానని.. గ్లామరస్ పాత్రలను అసలు చేయాలనుకోవడం లేదని తెలిపింది. కేవలం పవర్ ఫుల్ పాత్రల కోసమే తాను వెయిట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : 1000కి పైగా సినిమాలు.. సిల్క్ స్మిత కంటే ముందే ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. చివరి రోజుల్లో ఎంతగా బాధపడిందంటే..

రజినీకాంత్ నటించిన నరసింహా వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ నీలాంబరి పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారని.. అందుకే తనకు కూడా అలాంటి ఐకానిక్ రోల్స్ చేయాలని ఉందని తెలిపిందే. ప్రస్తుతం తాను సరైన రీఎంట్రీ గురించి వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి : Director: సక్సెస్ అంటే ఇది.. ఒకప్పుడు లారీ డ్రైవర్.. ఇప్పుడు గొప్ప డైరెక్టర్.. ఒక్క ప్లాపు లేని దర్శకుడు..

ఇవి కూడా చదవండి : Actor: ఒక్క సినిమాతోనే అమ్మాయిల డ్రీమ్ బాయ్‏గా.. వరుస హిట్లకు కేరాఫ్ అడ్రస్ ఈ హీరో.. క్రేజ్ చూస్తే..