15 రోజుల కోమా.. నాలుగేళ్లపాటు నరకం.. ముమైత్ ఖాన్ జీవితంలో ఇంత విషాదం ఉందా.!

అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది ముమైత్ ఖాన్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది. ఇటీవల కాలంలో ముమైత్ ఖాన్ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఆ మధ్య తెలుగు బిగ్ బాస్ షోలో సందడి చేసింది. రీసెంట్ గా ఓ డ్యాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరించింది. తర్వాత బుల్లితెర నుంచి కూడా మాయం అయ్యింది.

15 రోజుల కోమా.. నాలుగేళ్లపాటు నరకం.. ముమైత్ ఖాన్ జీవితంలో ఇంత విషాదం ఉందా.!
Mumait

Updated on: May 28, 2026 | 12:12 PM

ముమైత్ ఖాన్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఒకప్పుడు ఈ అమ్మడు కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారింది. ఐటమ్ సాంగ్స్‌లో తన అందచందాలతో ఉర్రుతలు ఊగించింది. సినిమాలో ఐటెం సాంగ్ అంటే ముమైత్ ఖాన్ ఉండాల్సిందే అనే రేంజ్‌లో రాణించింది ఈ అమ్మడు. తెలుగులోనే కాదు తమిళ్ ,హిందీ భాషల్లోనూ ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టింది. హీరోయిన్‌గాను కొన్ని సినిమాల్లో మెరిసింది ముమైత్. అయితే ఇటీవల కాలంలో ముమైత్ ఖాన్ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఆ మధ్య తెలుగు బిగ్ బాస్ షోలో సందడి చేసింది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో.. తన జీవితాన్నిమార్చేసిన ప్రమాదం, దాని పర్యవసానాల గురించి తెలిపింది. అలాగే తన బ్రెయిన్ హెమరేజ్, 15 రోజుల కోమా అనుభవం, ఆ తర్వాత ఎదురైన ఆర్థిక, శారీరక, మానసిక సవాళ్లను తెలిపింది. ముమైత్ వచెప్పిన దాని ప్రకారం, ప్రమాదం చాలా ఆకస్మికంగా జరిగింది. స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత, తాను పాడుకుంటూ అద్దంలో చూసుకోవడానికి వెళ్తుండగా, ఆమె అనుకోకుండా తన ఇటాలియన్ బెడ్‌కు బలంగా తగిలి పడిపోయారట.

ఇది కూడా చదవండి : అప్పట్లో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. అండర్ వరల్డ్ మాఫియా దెబ్బకు రాత్రికి రాత్రే మాయం..

“ఇటాలియన్ బెడ్ షార్ప్‌గా ఉంటుందినాకు ఎప్పుడూ ఇటాలియన్ బెడ్ ఇష్టం,”  అయితే ఆ దెబ్బ బ్రెయిన్ హెమరేజ్‌కు దారితీసిందని. మెదడులో మూడు రోజుల పాటు రక్తస్రావం జరిగినా, అది తనకు తెలియలేదని వివరించింది ముమైత్. “నేను గుర్తించలేదు. నిజంగా చెప్తాను, నేను 15 రోజుల తర్వాత కోమా నుంచి లేచినప్పుడు, అది మరుసటి రోజు అనుకున్నాను,” అని ఆమె గుర్తుచేసుకున్నారు. మొదట్లో ఆరోగ్యం క్షీణించినప్పుడు, “అమ్మా, నేను హాస్పిటల్ వెళ్ళాలి, ఆరోగ్యం బాగాలేదు” అని తల్లికి చెప్పినా, జ్వరం లేకపోవడంతో మొదట తల్లిదానిని పెద్దగా పట్టించుకోలేదట. మూడో రోజు ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారట. అక్కడ ఆమెను ఐసియులో చేర్చారట.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Jabardasth: జబర్దస్త్‌లో అతను చాలా కమర్షియల్.. భోజనానికి రమ్మని పిలిస్తే పెట్రోల్‌కు డబ్బులు అడుగుతాడు..

ముమైత్ 15 రోజుల పాటు కోమాలో గడిపారు. ఈ సమయం ఆమె కుటుంబానికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు అత్యంత కష్టమైనది. ముమైత్ తల్లి ఏడవలేదని, “నా బిడ్డ బతికితేనే నేను నమ్ముతాను, లేకపోతే లేదు” అని దేవుడిని ప్రార్థించారని ముమైత్ చెప్పుకొచ్చింది. ఈ భయంకరమైన అనుభవం ఆమె తల్లి ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగించింది, ఆమెకు బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చాయి. తండ్రి కూడా, 32 ఏళ్ల వయస్సులో మొదటిసారిగా ఏడ్చారని ముమైత్ పేర్కొన్నారు. కోలుకున్న తర్వాత, వైద్యులు ముమైత్ ఖాన్‌కు ఏడేళ్ల పాటు పనిచేయవద్దని సూచించారట.  చిన్ననాటి నుండి మైగ్రేన్ సమస్య ఉందట.. అంతేకాకుండా, సీజర్ అటాక్స్ కారణంగా తీసుకున్న మందుల వల్ల ఆమె బరువు పెరిగారట. ఇలా నాలుగు ఏళ్లు నరకం అనుభవించానని ఈ విషయాలన్నీ ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : ఆ ఇద్దరు హీరోలతో సినిమాలు చేయాలనుంది.. ఎప్పుడు ఛాన్స్ వస్తుందో చూడాలి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us