Tollywood: ఆధ్యాత్మిక గురువును పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

మరో సినిమా సెలబ్రిటీ పెళ్లిపీటలెక్కింది. తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన ఓ ముద్దుగుమ్మ తన ప్రియుడితో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. మలేసియా దగ్గరలోని లంగకవి ఐలాండ్ వేదికగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tollywood: ఆధ్యాత్మిక గురువును పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress

Updated on: Nov 16, 2026 | 7:59 PM

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు నిశ్చితార్థం, పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పటికే సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కామ్యా మారన్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ఇక టాలీవుడ్ హీరోలు సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జా కూడా గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి రెడీ అయిపోయారు. అలాగే దివంగత నటుడు శ్రీహరి పెద్ద కుమారుడు కూడా త్వరలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు. ఇప్పుడీ జాబితాలోకి ఒక క్రేజీ హీరోయిన్ కూడా చేరిపోయింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌తో తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రముఖ హీరోయిన్, గద్దల కొండ గణేష్ ఫేమ్ మృణాళిని రవి పెళ్లిపీటలెక్కింది. తన ప్రియుడు, మలేసియాకు చెందిన మహావిష్ణు అనే ఆధ్యాత్మిక గురువు మహా విష్ణుతో కలిసి ఆదివారం(నవంబర్ 15) ఏడడుగులు వేసింది. మలేసియా దగ్గరలోని లంగకవి ఐలాండ్ వేదికగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం మిర్నాళిని-మహావిష్ణు ఒక్కటయ్యారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను స్వయంగా మృణాళిని.. తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

 

ఇవి కూడా చదవండి

మృణాళిని రవి- మహా విష్ణుల పెళ్లి ఫొటోస్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు ఈ కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మృణాళిని రవి- మహా విష్ణులు మొదట మంచి స్నేహితులు. ఆ తర్వాత ఫ్రెండ్ షిప్ కాస్తా ప్రేమగా చిగురించింది. ఇప్పుడు పెద్దల ఆశీర్వాదంతో పెళ్లిగా మారింది. 2019 చిత్రం ‘సూపర్ డీలక్స్’తో తమిళ చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది మృణాళిని రవి. ఆ తర్వాత ఆమె సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ‘ఛాంపియన్’ చిత్రంలో కథానాయికగా నటించింది. ఆర్య, విశాల్ నటించిన ‘ఎనిమీ’ చిత్రంలో యాక్ట్ చేసింది. ‘ఎంజీఆర్ మగన్’, ‘జాంగో’ ‘కోబ్రా’ సినిమాల్లోనూ యాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేశ్’తో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మామ మశ్చీంద్ర తదితర తెలుగు సినిమాల్లో కూడా కథానాయికగా చేసింది. ఇక చివరగా 2024లో ‘రోమియో’ అనే తమిళ చిత్రంలో కనిపించింది మృణాళిని.

మృణాళిని రవి పెళ్లి ఫొటోస్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us