
కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ ( జయం రవి ), ఆయన భార్య ఆర్తి రవిల విడాకుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇటీవల ప్రెస్ మీట్‌లో జయం రవి మాట్లాడుతూ భార్య ఆర్తి, ఆమె కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేశాడు.పెళ్లయిన నాటి నుంచి తాను తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నానని వాపోయారు. తనపై ‘చేతబడి’ కూడా చేయడంతో రక్తం కక్కుకున్నానని, మానసిక క్షోభతో ఆత్మహత్యకు యత్నించానని అందరి ముందు కన్నీరు పెట్టుకున్నారు. అయితే దీనికి భార్య ఆర్తి కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ విడాకుల వివాదంలోకి ఖుష్బూ కూడా ఎంటరయ్యింది. మొత్తానికి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, దుమ్మెత్తిపోసుకుంటూ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు రవి- ఆర్తి జంట. తాజాగా ఈ విషయంలో జయం రవికి బహిరంగంగా మద్దతు పలికింది ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా. ఈ మేరకు రవి వెర్షన్ కూడా అందరూ వినాలని ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ పెట్టింది.
‘నాకు నటుడు జయం రవి చాలా బాగా తెలుసు. అతను ఎంతో సున్నితమైన, మంచి వ్యక్తి. ప్రతిసారీ తప్పు మగవాడిదే కానక్కర్లేదు. ఈ రోజుల్లో కొంతమంది మహిళలు తమకు అనుకూలంగా ఉన్న చట్టాలను, వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. సమాజం ఎప్పుడూ ఒక పక్షాన్నే వినకూడదు. మగవారి వెర్షన్‌ను కూడా ప్రపంచం వినాలి. రవిని చూస్తుంటే బాధగా ఉంది. అతనికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, నిజం గెలుస్తుందని ఆశిస్తున్నాను’ అని ఎక్స్ లో రాసుకొచ్చింది మీరా చోప్రా. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
I know this guy as #jeyamRavi. Knew him quiet well when i was working in south movies. Just read about his divorce. My two cents would be. Man is not the one who is wrong all the time. Iam comimg across lot of women taking advantage of laws which are skewed towards women. A man… pic.twitter.com/i7eRxu8VB2
— Meerra Chopraa (@MeerraChopra) May 16, 2026
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు కజిన్ సిస్టర్ అయిన మీరా చోప్రా తెలుగు అభిమానులకు కూడా సుపరిచితమే. పవన్ కల్యాణ్ బంగారం, వాన తదితర సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ అందాల తార.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.