ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఖుష్బూ ఒకరు. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమె.. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..
Khushboo

Updated on: May 29, 2026 | 8:20 PM

హీరోయిన్ ఖుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతోపాటు దక్షిణాదిలోని అన్నీ భాషలలో నటించి అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో సహయ నటిగా అలరిస్తుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె సినీ రంగంలోని తన సుదీర్ఘ ప్రయాణంలో ఏర్పడిన బంధాలను, అగ్రతారలతో తనకున్న సాన్నిహిత్యాన్ని వివరించారు. విక్టరీ వెంకటేష్‌ను తన “సెంటిమెంటల్ పర్సన్”గా తెలిపారు. వెంకటేష్ తన మొదటి హీరో, మొదటి స్నేహితుడు అని తెలిపారు. రోజూ మాట్లాడుకోకపోయినా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా ఉంటామని చెప్పారు. వెంకటేష్‌ను సెంటి పార్ట్‌గా, తనను మెంటల్ పార్ట్‌గా సరదాగా అన్నారు. కలియుగ పాండవులు సినిమాతో వీరి ప్రయాణం మొదలైందని గుర్తు చేసుకున్నారు. వెంకటేష్ కామెడీ, ఆయన సినిమాల పట్ల ఖుష్బూ ప్రశంసలు కురిపించారు.

ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..

నాగార్జునను “అత్యంత హ్యాండ్సమ్ హీరో”గా, “మోస్ట్ స్టైలిష్ యాక్టర్”గా ఖుష్బూ చెప్పుకొచ్చారు. ప్రతి మహిళ నాగార్జునను ప్రేమించాలని, ఆయనతో రొమాన్స్ చేయాలని కోరుకుంటుందని అన్నారు. 1986లో కెప్టెన్ నాగార్జున సినిమాలో చూసినప్పుడు ఆయన కార్గో ప్యాంట్‌లలో ఎంత స్టైలిష్‌గా కనిపించారో గుర్తు చేసుకున్నారు. నాగార్జున ఇప్పటికీ ఫిట్‌గా, హ్యాండ్సమ్‌గా ఉన్నారని, ఇటీవల ఆయనను కలిసిన ఒక స్నేహితురాలు “ఈ మనిషిని చూసి నేను ప్రేమలో పడిపోయాను” అని చెప్పిందని, తాను వెంటనే నాగార్జునకు మెసేజ్ చేసి ఈ విషయం చెప్పానని ఖుష్బూ వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

మెగాస్టార్ చిరంజీవిని “లెజెండ్” అని అన్నారు. ఆయన నిరాడంబరత, డౌన్ టు ఎర్త్ ఆటిట్యూడ్, పని పట్ల అంకితభావం అద్భుతమని తెలిపారు. చిరంజీవి ప్రతి రోజు సెట్‌లో కొత్తగా ఏదో నేర్చుకోవాలని, కొత్తగా ఏదో చేయాలని తపిస్తుంటారని, అందుకే ఆయన ఇప్పటికీ “మెగాస్టార్” అని ఖుష్బూ స్పష్టం చేశారు. రాజేంద్ర ప్రసాద్‌ను “బావ” అని పిలుస్తానని ఖుష్బూ చెప్పారు. ఆయన తన బెస్ట్ ఫ్రెండ్‌కు చాలా సన్నిహితుడని, ఇద్దరూ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో కలిసి చదువుకున్నారని తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ తనకు “శాశ్వత బావ” అని, ఆయనతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..

కమల్ హాసన్‌ను తన “స్వీట్ హార్ట్”గా, చాలా సన్నిహిత మిత్రుడిగా ఖుష్బూ పేర్కొన్నారు. కమల్ పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, ఆయనను ఒక పీఠంపై పెట్టుకుని పూజిస్తానని అన్నారు. రజనీకాంత్ పట్ల కూడా తనకు అపారమైన గౌరవం ఉందని, ఆయనను చూసినప్పుడు మాటలు కూడా రావని చెప్పారు. రజనీకాంత్ పని పట్ల చూపే అంకితభావం అద్భుతమని, ఉదయం 7 గంటలకు కాల్ షీట్ ఉంటే 6:50 కల్లా మేకప్‌, కాస్ట్యూమ్‌తో సెట్స్‌లో ఉంటారని వివరించారు. డైరెక్టర్ విరామం తీసుకోమన్నా, ఆయన సెట్‌లోనే కూర్చుని అందరినీ, ప్రతి షాట్‌ను, లైటింగ్‌ను గమనిస్తుంటారని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..

Follow Us