Kriti Shetty: సినిమా సినిమాకు చేంజ్ చూపిస్తానంటున్న పంచదార చిలక.. కృతికి అలాంటి పాత్ర చేయాలనుందట

అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ ప్రియా శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో పరిచయం అయ్యింది

Kriti Shetty: సినిమా సినిమాకు చేంజ్ చూపిస్తానంటున్న పంచదార చిలక.. కృతికి అలాంటి పాత్ర చేయాలనుందట
Kruthi

Updated on: Jan 04, 2022 | 3:43 PM

Kriti shetty: అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ ప్రియా శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో పరిచయం అయ్యింది కుందనపు బొమ్మ కృతి. బెబమ్మ పాత్రలో అందంగా ఒదిగిపోయింది. చూడచక్కని రూపం. ఆకట్టుకునే అమాయకత్వంతో కృతి కుర్రాళ్లను కట్టిపడేసింది. ఇక ఈ సినిమా తర్వాత కృతి నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో మెరిసింది. అయితే మొదటి సినిమాకు రెండో సినిమాలో చాలా చేంజ్ చూపించింది ఈ బ్యూటీ. ఉప్పెన సినిమాలో పద్దతిగా పక్కింటి అమ్మాయిలా కనిపించిన కృతి.. శ్యామ్ సింగరాయ్ సినిమాలో మాత్రం మోడ్రన్ బ్యూటీగా మెరిసింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో ఈ చిన్నది ఇప్పుడు గోల్డెన్ లెగ్ అయ్యింది.

ఇక ఇప్పుడు వరుస సినిమాలతో కృతి దూసుకుపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టి బిజీగా గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ. రామ్ .. నితిన్ .. చైతూ ..సుధీర్ బాబు ఇలా వరుస సినిమాలతో తన జోరు చూపిస్తోంది. తాజాగాా కృతి శెట్టి ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. సినిమా సినిమాకూ తేడా చూపించాలని అనుకుంటున్నా.. అన్నీ ఒకేలాంటి పాత్రలు చేయాలనీ లేదు అని చెప్పుకొచ్చింది. ఇక మొదటి సినిమాకు రెండో సినిమాకు నా పాత్ర చాలా చేంజ్ ఉంటుంది. బేబమ్మ పాత్రకి దూరంగా ఉండే పాత్రలను చేయాలని అనుకున్నాను. ఆ సమయంలోనే నాకు ‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి కీర్తి పాత్ర వచ్చింది అని అందు. అలాగే ఇద్దరు హీరోల నుంచి చాలా నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చింది కృతి శెట్టి. ప్రస్తుతం చేస్తున్నవన్నీ డిఫరెంట్ రోల్సే. అయితే యాక్షన్ సినిమాలో .. యాక్షన్ రోల్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది” అంటూ చెప్పుకొచ్చింది ఈ చూడచక్కని భామ.

మరిన్ని ఇక్కడ చదవండి :

Liger Glimpse-Vijay Devarakonda: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న లైగర్ గ్లింప్స్.. రికార్డ్స్ కొల్లగొడుతున్న రౌడీ విజయ్..

Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ ఓటీటీ లాంచ్ డేట్ అప్పుడేనా.. కంటెస్టెంట్లు వీరేనా.!

Viral Photo: పిస్టోల్ చేతపట్టి స్టైల్‏గా ఫోటోకు ఫోజిచ్చిన ఈ చిన్నది.. ఇటు సౌత్, అటు నార్త్‏లో దూసుకుపోతుంది..

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us