Actress Jyotika: పాన్ ఇండియా సినిమాలో జ్యోతిక.. 20 ఏళ్ల తర్వాత విజయ్ దళపతి సినిమాలో..

|

Aug 13, 2023 | 4:33 PM

పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక.. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసింది. ఓవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న జ్యోతిక.. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. ఇటీవల ఆమె జిమ్ లో హెవీ వర్కవుట్స్ చేస్తున్న వీడియోస్, ఫోటోస్ నెట్టింట తెగ వైరలయిన సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే తాజాగా జ్యోతిక క్రేజీ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.

Actress Jyotika: పాన్ ఇండియా సినిమాలో జ్యోతిక.. 20 ఏళ్ల తర్వాత విజయ్ దళపతి సినిమాలో..
Jyotika, Vijay Thalapathy
Follow us on

హీరోయిన్ జ్యోతిక.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీ హీరోయిన్. తమిళంతోపాటు.. తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. చూడచక్కని రూపం.. అందమైన కళ్లతో తెలుగు ప్రజల హృదయాలను దోచుకుది. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ వంటి స్టార్ హీరోస్ సరసన నటించిన జ్యోతిక.. తమిళ్ హీరో సూర్యను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక.. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసింది. ఓవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న జ్యోతిక.. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. ఇటీవల ఆమె జిమ్ లో హెవీ వర్కవుట్స్ చేస్తున్న వీడియోస్, ఫోటోస్ నెట్టింట తెగ వైరలయిన సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే తాజాగా జ్యోతిక క్రేజీ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించనున్న పాన్ ఇండియా చిత్రంలో ఆమె కీలకపాత్రలో నటించనుందట. వీరిద్దరూ దాదాపు 20 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు.

దళపతి విజయ్ ప్రస్తుతం ‘లియో’ సినిమాతో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ తర్వాత విజయ్ నేరుగా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. లియో తర్వాత విజయ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయిలో రూపొందనున్నారట. ఇక ఇందులో నటి జ్యోతిక కీలకపాత్ర పోషించనుందని సమాచారం.

జ్యోతిక జిమ్ వీడియో..

జ్యోతిక ఇన్ స్టా ఫోటోస్..

జ్యోతిక తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది. జ్యోతిక, దళపతి విజయ్ తమిళ సినిమా ‘ఖుషి’ (2000), ‘తిరుమలై’ (2003)లో కలిసి నటించారు. ఇక ఇప్పుడు దాదాపు 2 దశాబ్దాల తర్వాత వీరిద్దరు కలిసి నటించనున్నారు. అయితే ఈ వార్తపై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ సినిమాలో జ్యోతిక హీరోయిన్ గా నటిస్తుందా లేక మరేదైనా ప్రధాన పాత్రలో నటిస్తుందా అనేది కూడా క్లారిటీ లేదు.

జ్యోతిక ఫ్యామిలీ ఫోటోస్..

ప్రస్తుతం జ్యోతిక వయసు 44 ఏళ్లు. సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో బిజీగా ఉంది.. అజయ్ దేవగన్, ఆర్. మధనవన్ నటిస్తున్న కొత్త బాలీవుడ్ సినిమాలో జ్యోతిక నటిస్తోంది. జ్యోతిక తన భర్త, కోలీవుడ్ నటుడు సూర్య కెరీర్‌కు సపోర్ట్ చేస్తోంది. ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. మరోవైపు నిర్మాతగానూ రాణిస్తోంది జ్యోతిక.

విజయ్ దళపతి ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.