
నటి జ్యోతి అంటే టక్కున గుర్తుపట్టకపోవచ్చు కానీ తిలోత్తమ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. తన పాత్రతో నటనతో అంతలా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జ్యోతి. గతంలో జ్యోతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ స్టార్ హీరో గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. జ్యోతి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి చిరంజీవి గారే తనను స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. చిరంజీవి గారి డాన్స్ స్టెప్పులను కాపీ ద్వారానే తనకు డాన్స్ పట్ల ఆసక్తి పెరిగిందని, అది సినిమాల్లోకి రావడానికి మార్గం సుగమం చేసిందని జ్యోతి అన్నారు. స్కూల్ లేదా ఊరిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో డాన్స్‌లో ముందుండేదాన్నని ఆమె గుర్తుచేసుకున్నారు. తన తండ్రి ప్రోత్సాహంతోనే తాను సినీ రంగంలోకి వచ్చానని, అయితే చిత్రసీమలో ప్రవేశించిన తర్వాత తన తండ్రి గుండెపోటుతో మరణించడం తన జీవితంలో అతిపెద్ద బాధగా మిగిలిందని జ్యోతి విచారం వ్యక్తం చేశారు. ఆ బాధ నుండి కోలుకోవడానికి సమయం పట్టిందని ఆమె పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ అద్భుతంగా డైలాగ్ చెప్పగానే ఆ హీరోయిన్ కన్నీళ్లుపెట్టుకుంది.. సెట్‌లో అందరూ షాక్ అయ్యాం..
చిరంజీవి గారితో కలిసి నటించాలనే తన కల అందరివాడు సినిమాతో నెరవేరిందని జ్యోతి గుర్తుచేసుకున్నారు. అందరివాడు సినిమాలో చిరంజీవి గారు ద్విపాత్రాభినయం చేశారని, సినిమాలో పెళ్లిచూపుల సన్నివేశంలో తన పాత్ర చిరంజీవి గారిని కాదని, మరో వ్యక్తిని వివాహం చేసుకునే సన్నివేశం.. అయితే ఆ సీన్ తనకు చాలా బాధగా అనిపించిందని ఆమె గుర్తుచేసుకున్నారు. చిరంజీవిలాంటి వ్యక్తిని ఎదురుగా పెట్టుకొని.. వేరొకరిని ప్రేమించా అని చెప్పే ఆ సన్నివేశం చాలా ఇబ్బందిగా అనిపించింది అని ఆమె తెలిపారు. ఆ సీన్ టైం లో చిరంజీవి గారు నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అని చెప్పాలని మనసులో చాలా అనుకున్నాను అని జ్యోతి తెలిపారు.
ఇది కూడా చదవండి : పుట్టుకతోనే గుండెజబ్బు.. షూటింగ్‌లోనే రక్తపు వాంతులు.. కట్టుకున్న భర్త కూడా వదిలేశాడు..
అలాగే పెళ్ళాం ఊరెళ్తే సినిమాలో తాను ఐబ్రో ఎత్తిన సన్నివేశాన్ని చిరంజీవి ప్రత్యేకంగా ప్రశంసించారని, తాను కూడా దాన్ని ప్రాక్టీస్ చేశానని చెప్పడం తనకెంతో మధురమైన జ్ఞాపకమని జ్యోతి తెలిపారు. ఆ సమయంలో తాను చాలా చిన్నదానినని, ఎక్కువగా మాట్లాడలేదని అన్నారు. భవిష్యత్తులో కేవలం నటిగానే కాకుండా, హోస్ట్‌గా, నిర్మాతగా, దర్శకురాలిగా కూడా రాణించాలనే తన ఆకాంక్షలను జ్యోతి వెల్లడించారు. సమాజానికి సందేశం ఇచ్చే, ముఖ్యంగా మహిళలు ఎలా దోపిడీకి గురవుతున్నారు అనే అంశాలపై ఆధారపడిన మహిళా ప్రాధాన్య చిత్రాలు చేయాలనే కోరిక తనకు ఉందని ఆమె అన్నారు. ఎప్పటికీ తన ఆల్‌టైమ్ ఫేవరెట్ హీరో చిరంజీవి, హీరోయిన్ శ్రీదేవి అని జ్యోతి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : 15 రోజుల కోమా.. నాలుగేళ్లపాటు నరకం.. ముమైత్ ఖాన్ జీవితంలో ఇంత విషాదం ఉందా.!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి