టాలీవుడ్ హీరోయిన్ హాన్సిక మోత్వానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తన బిజినెస్ పార్టనర్ సోహాల్ కతూరియాతో డిసెంబర్ 4న ఏడడుగులు వేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాజస్థాన్ లోని జైపూర్ లో ఓ ప్రాచీన ప్యాలెస్ లో వీరి వివాహం జరగునుంది. పెళ్లికి రెండు రోజుల ముందుగానే మెహిందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు ఓటీటీలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇటీవల తన ప్రియుడిని ఇన్ స్టా వేదికగా అభిమానులకు పరిచయం చేసింది హన్సిక. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
పెళ్లికి ముందు వధువులా ముస్తాబై ఎరుపు చీరలో కనిపించింది. వివాహ వేడుకలో భాగంగా జరిగే మాతా కీ చౌకీ కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంతో ఈరోజు వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం కాబోయే వధువు ఎరుపు రంగు చీర ధరించి కారులో పూజకు వెళ్తుండగా కెమెరాకు చిక్కింది. ముంబై జరుగుతున్న ఈ వేడుకలో హాన్సిక అచ్చం నూతన వధువులా కనిపించింది. మాతా కీ చౌకీ తర్వాత డిసెంబర్ 2న సూఫీ నైట్, డిసెంబర్ 3 న మెహందీ, సంగీత వేడుకలు జరగనున్నాయి.
ఇదిలా ఉంటే.. సోమవారం పూర్తిగా న్యూలుక్లో కనిపించి అభిమానులకు షాకిచ్చింది ఈ దేశముదురు బ్యూటీ. నయా హెయిర్ స్టైల్ తో ముంబైలోని ఓ ప్రముఖ సెలూన్ నుంచి బయటకు వస్తున్న హాన్సిక గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
. @ihansika looks gorgeous in red-saree for Mata-ki-chowki , ahead of wedding with #sohaelkathuriya ❤️❤️.
.
.#hansikamotwani #hansika #weddingbells pic.twitter.com/C9J4m8Tsm6— SIIMA (@siima) November 22, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.