Green India challenge: ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ మహా యజ్ఞంలా సాగుతుంది. ఇప్పటికే సెలబ్రిటీలు సామాన్యులు అందరు ఈఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటుతున్నారు. తాజాగా సినీనటి అర్చన శాస్త్రి మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా యాంకర్ దీప్తి వాజ్‌పేయి విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించి మంగళవారం జూబ్లీహిల్స్‌లోని పార్కులో అర్చన మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మధుమిత, శివబాలాజీ,నేహసుమన్ షా, అశీమ, ప్రాచీలు గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని అర్చన పిలుపునిచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Adipurush Movie : ప్రభాస్ కు తల్లిగా ఒకప్పటి అందాల తార.. ఆదిపురుష్‌లో ఆ బాలీవుడ్ నటి..