
టాలీవడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి హిట్లతో స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఇటీవలే కింగ్డమ్ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చారు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు విజయ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ విజయ్ దేవరకొండ తన సెలబ్రెటీ క్రష్ అని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. కోలీవుడ్ హీరోయిన్ అనికా సురేంద్రన్. నవంబర్ 27, 2004న కేరళలోని మంజేరిలో జన్మించారు. ఆరేళ్ల వయసులోనే బాలనటిగా తెరంగేట్రం చేసింది. 2010లో కథ తుడారున్ను చిత్రంతో మలయాళ సినిమాలో బాలనటిగా అరంగేట్రం చేసింది.
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
2022 వరకు దాదాపు 12 సంవత్సరాలు తమిళ, తెలుగు సినిమాల్లో బాలనటిగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2015లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఎన్నై అరిందాల్ చిత్రంతో అనికా సురేంద్రన్ తమిళ సినిమాలో బాలనటిగా అరంగేట్రం చేసింది. ఇందులో త్రిష, అజిత్ కూతురిగా కనిపంచింది. బాలనటిగా అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు కథానాయికగా మారింది. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
ఫిబ్రవరి 2025లో థియేటర్లలో విడుదలైన నిలవుకు ఎన్మేల్ ఎన్నడి కోపం (జాబిలమ్మా నీకు అంత కోపమా) చిత్రంలో నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సెలబ్రెటీ క్రష్ ఎవరు అని అడగ్గా.. తెలుగు హీరో విజయ్ దేవరకొండ అని చెప్పుకొచ్చింది. దీంతో అనిక కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‌లో యమ క్రేజ్..