Anikha Surendran: టాలీవుడ్‏లోకి మరో మలయాళీ ముద్దుగుమ్మ.. క్రేజీ ఆఫర్ అందుకున్న అజిత్ కూతురు..

టాలీవుడ్‏లో తెలుగు భామలు కాకుండా..ఇతర భాష ముద్దుగుమ్మలే ఎక్కువగా హీరోయిన్స్‏గా చెలామణి అవుతుంటారు. దాదాపు ఇప్పుడున్న

Anikha Surendran: టాలీవుడ్‏లోకి మరో మలయాళీ ముద్దుగుమ్మ.. క్రేజీ ఆఫర్ అందుకున్న అజిత్ కూతురు..
Anikha

Updated on: Aug 09, 2021 | 3:27 PM

టాలీవుడ్‏లో తెలుగు భామలు కాకుండా..ఇతర భాష ముద్దుగుమ్మలే ఎక్కువగా హీరోయిన్స్‏గా చెలామణి అవుతుంటారు. దాదాపు ఇప్పుడున్న టాప్ హీరోయిన్స్ అందరూ ఇతర భాషలకు చెందినవారే కావడం గమనార్హం. తాజాగా మరో బ్యూటీ తెలుగులో క్రేజీ ఆఫర్ అందుకుంది. తమిళ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన ఎంతవాడు గానీ, విశ్వాసం వంటి సినిమాల్లో అజిత్ కూతురుగా నటించిన గుర్తింపు పొందింది అనిఖా సురేంద్రన్. ఈ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది అనిఖా.

Anika

దక్షిణాది సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిఖా.. ఇటీవల హీరోయిన్‏గా ఎంట్రీ ఇవ్వబోతుందంటూ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. అందుకు తగ్గట్టుగానే అనిఖా ఫోటోషూట్స్ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ అమ్మడు తెలుగులో క్రేజీ ఆఫర్ అందుకున్నట్లుగా సమాచారం. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన రొమాంటిక్ థ్రిల్లర్ కప్పెలా తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. కొద్ది నెలల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో అనిఖా హీరోయిన్‏గా ఎంపికైనట్టు టాక్ వినిపిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీలో యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ, కైతి, మాస్టర్ ఫేమ్ అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు శౌరి చంద్రశేఖర్ టీ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే నాగార్జున, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో కూడా అనిఖా కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‏లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు.

ట్వీట్..

Also Read: RK Selvamani: కోలీవుడ్‏లో ముదురుతున్న వివాదం.. హీరో శింబుపై తీవ్ర ఆరోపణలు చేసిన రోజా భర్త సెల్వమణి..

Meera Mithun: బిగ్‏బాస్ బ్యూటీపై మండిపడుతున్న నెటిజన్లు… 7 సెక్షన్ల కింద కేసు నమోదు.. ఇంతకీ ఏం చేసిందంటే..

Mahesh New Look: ఇదేంటి బాబు ఏజ్‌ పెరుగుతుందా.. తగ్గుతుందా.? నాలుగు పదుల వయసులోనూ నవ యువకుడిలా..

Ravi Teja: బయోపిక్‌‌‌‌లో నటించనున్న మాస్‌‌‌‌రాజా.. గజదొంగ టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ ఫిక్స్ అయినట్టేనా..?

 

Follow Us