Amala Paul: స్టూడెంట్స్‌కు ఏం సందేశం ఇస్తున్నారు మేడమ్‌? అమలాపాల్ పై నెటిజన్ల మండిపాటు.. అసలు ఏమైందంటే?

|

Jul 25, 2024 | 8:37 PM

మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇద్దరమ్మాయిలతో, నాయక్, లవ్ ఫెయిల్యూర్ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ అందాల తార బాగా చేరువైపోయింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగత జీవితంలో పలు సమస్యలు ఎదుర్కొంది అమలా పాల్.

Amala Paul: స్టూడెంట్స్‌కు ఏం సందేశం ఇస్తున్నారు మేడమ్‌? అమలాపాల్ పై నెటిజన్ల మండిపాటు.. అసలు ఏమైందంటే?
Amala Paul
Follow us on

మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇద్దరమ్మాయిలతో, నాయక్, లవ్ ఫెయిల్యూర్ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ అందాల తార బాగా చేరువైపోయింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగత జీవితంలో పలు సమస్యలు ఎదుర్కొంది అమలా పాల్. ముఖ్యంగా భర్తతో విడాకులు తీసుకుని మళ్లీ జీవితంలో నిలదొక్కుకుంది. గత ఏడాది రెండో పెళ్లి చేసుకుని ఇటీవలే ఓ పండట బిడ్డకు జన్మనిచ్చింది . అయితే ఈ మధ్య కాలంలోతరచూ వివాదాల్లో చిక్కుకుంటుంది అమలా పాల్. ఇటీవల ఓ హెయిర్ డ్రెస్సర్ తనను అవమానించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది అమలాపాల్. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం లెవల్ క్రాస్ అనే మలయాళ మూవీ లో నటిస్తోందీ అందాల తార. ఆసిఫ్ అలీ హీరోగా నటిస్తున్నాడు. అర్ఫజ్ అయుబ్ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న లెవెల్ క్రాస్ శుక్రవారం( జులై 26వ తేదీన) విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆసిఫ్ అలీ, అమలా పాల్ ఎర్నాకులం, కొచ్చిలోని సెయింట్ ఆల్బర్ట్ కాలేజీకి వెళ్లారు. అయితే అమల పొట్టి దుస్తులలో నెక్ లైన్‌తో దర్శనమిచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. పొట్టి దుస్తులతో కనిపించి విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే తన డ్రెస్‌పై వస్తున్న విమర్శలపై అమలా పాల్‌ కూడా స్పందించింది. ఆ డ్రెస్‌లో తాను కంఫర్ట్ గానే ఉన్నానని తెలిపింది.
‘నాకు సౌకర్యవంతంగా ఉన్న దుస్తుల్నే ధరించాను కానీ.. సరైనవా కాదా అని భావించలేదు.. ఈ ఫంక్షన్‌కి ఈ దుస్తులు సరైనది కాదు అని ఆలోచించలేదు. కెమెరాలు నా డ్రెస్సింగ్ స్టైల్‌ను తప్పుగా ప్రొజెక్ట్ చేసినట్లు ఉన్నాయి. నేను వేసుకున్న దుస్తులు పట్ల విద్యార్థులు అసలు అసౌకర్యంగా లేరు. నేను సంప్రదాయం, పాశ్చాత్య దుస్తులు ధరిస్తాను. ఏ దుస్తులు వేసుకోవాలో ఎంచుకునే ఛాయిస్ వారికి ఉండాలనే ఆత్మస్థైర్యాన్ని విద్యార్థుల్లో నింపాలనుకుంటున్నాను’ అని అమలా పాల్ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

కాగా ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.