Tollywood: అరె.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌కు పెళ్లైపోయిందా? భర్త ఎవరో తెలుసా? రొమాంటిక్ ఫొటోస్ వైరల్

ఈ టాలీవుడ్ హీరోయిన్ పెద్దగా సినిమాల్లో నటించలేదు. కానీ ఈ అందాల తార చేసిన వన్నీ ఫీల్ గుడ్ సినిమాలే. దీంతో ఈ అమ్మడికి బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలోనూ మంచి క్రేజ్ ఉంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

Tollywood: అరె.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌కు పెళ్లైపోయిందా? భర్త ఎవరో తెలుసా? రొమాంటిక్ ఫొటోస్ వైరల్
Tollywood Actress

Updated on: Jun 03, 2025 | 5:23 PM

ఆకాంక్ష సింగ్.. ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ.. అక్కినేని సుమంత్ హీరోగా నటించిన ఫీల్ గుడ్ మూవీ మళ్లీ రావా హీరోయిన్ అంటే ఇట్టే ఓ అందమైన రూపం కళ్ల ముందు మెదులుతుంది. 2017లో బద్రీనాథ్ కి దుల్హనియా అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసిందీ ముద్దుగుమ్మ. తెలుగులో మళ్లీ రావా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అలాగే న్యాచురల్ స్టార్ నాని , నాగార్జున కలిసి నటించిన దేవదాస్ సినిమాతోనూ తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. పలు హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటించిన ఈ సొగసరి చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం షష్టి పూర్తి. ‘లేడీస్ టైలర్’ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన రాజేంద్రప్రసాద్‌, అర్చన తిరిగి 37 సంవత్సరాల తరువాత మళ్లీ ఈ సినిమాలో జంటగా నటించారు. మే30 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి ఫీల్ గుడ్ సినిమా అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఆకాంక్ష సింగ్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. అలా తాజాగా ఆకాంక్ష షేర్ చేసిన ఫొటోలు చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఈ బ్యూటీ తన భర్తతో కలిసున్న రొమాంటిక్ ఫొటోలను షేర్ చేసింది. మంగళవారం (జూన్ 03) తమ పెళ్లి రోజు కావడంతో భర్త కునాల్ సేన్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుందీ అందాల తార. జార్జియాలోని కజ్బెగీ అనే టూరిస్ట్ ప్లేస్ ఇందుకు వేదికైంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయ. చాలా మంది ఈ ఫొటోలను చూసి’ ఈ హీరోయిన్ కు అప్పుడే పెళ్లైపోయిందా? అది పదేళ్ల క్రితమే’ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

భర్తతో ఆకాంక్ష సింగ్..

కాగా ఆకాంక్ష సింగ్ భర్త పేరు కునాల్ సైన్. వీరిది ప్రేమ వివాహం. కునాల్ ఒక మార్కెటింగ్ ప్రొఫెషనల్ అని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

Tollywood: ‘ఆర్మీ ట్రైనింగ్‌ను, క్రికెట్‌ను మధ్యలో వదిలేశాను’.. పశ్చాత్తాపపడుతోన్న టాలీవుడ్ యాంకర్.. ఎవరంటే?

Tollywood: ఒకప్పుడు బార్ ముందు మంచింగ్ ఐటమ్స్ అమ్మాడు.. కట్ చేస్తే 800 కోట్ల సినిమాతో సంచలనం.. ఎవరో తెలుసా?

Tollywood: మహేష్‌తో సహా 12 మంది స్టార్స్ రిజెక్ట్ చేశారు.. చివరకు ఆ హీరో బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఏ మూవీనో తెలుసా?

OTT Movie: 8 కోట్లతో తీస్తే 83 కోట్లు.. IMDbలో 8.6 రేటింగ్‌.. ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్