Vikram Chiyaan : తెలుగులో ఆ హీరో అంటే ఎక్కువ ఇష్టం.. ఆ హీరోయిన్ తో లాంగ్ డ్రైవ్ వెళ్తా.. విక్రమ్ చియాన్..

కోలీవుడ్ హీరో విక్రమ్ చియాన్ గురించి చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కేవలం తమిళంలోనే కాకుండా ఈ హీరోకు తెలుగులోనూ విపరీతమైన కరేజ్ సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. గతంలో విక్రమ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తనకు తెలుగులో ఇష్టమైన హీరో గురించి చెప్పుకొచ్చారు.

Vikram Chiyaan : తెలుగులో ఆ హీరో అంటే ఎక్కువ ఇష్టం.. ఆ హీరోయిన్ తో లాంగ్ డ్రైవ్ వెళ్తా.. విక్రమ్ చియాన్..
Vikram

Updated on: Jul 15, 2026 | 10:08 PM

విలక్షణ నటనతో, విభిన్నమైన పాత్రలతో దక్షిణాది సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు చియాన్ విక్రమ్. ఆయన ఏ పాత్ర చేసినా అందులోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులని మంత్రముగ్ధులను చేస్తారు. తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా అపరిచితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆరు పదుల వయసులోనూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. అలాగే ఫిట్నెస్ విషయంలోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సినిమాల వెనుక ఉన్న కృషిని విక్రమ్ ఈ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా ‘శివపుత్రుడు’ (Pithamagan) సినిమాలో డైలాగులు లేని మూగ పాత్ర కోసం తాను పడిన కష్టాన్ని వివరించారు. ఈ పాత్ర రూపకల్పనలో దర్శకుడు బాలా తనకు ఎంతో సహాయపడ్డారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తుల హావభావాలను నిశితంగా పరిశీలించి వాటిని తన నటనలో జోడించినట్లు తెలిపారు.

అలాగే తనకు జంతువులంటే ఎంతో ఇష్టమని వెల్లడించారు. తన ఫామ్‌హౌస్‌లో కుక్కలు, కోకాటూ (Cockatoo) పక్షులు, గీస్ (బాతులు) వంటి ఎన్నో జీవులను పెంచుకుంటున్నట్లు చెప్పారు. వాటి బాడీ లాంగ్వేజ్‌ను పరిశీలించడం ద్వారా తన నటనను మరింత మెరుగుపరుచుకున్నానని, ఫైట్ సీన్స్ ముగిసిన తర్వాత శరీరాన్ని ఒక జంతువులా విదిల్చే మూమెంట్‌ను కూడా అక్కడి నుంచే నేర్చుకున్నానని విక్రమ్ సరదాగా చెప్పుకొచ్చారు.

ఇక ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో భాగంగా “అవార్డులు తెచ్చే క్లాసిక్ సినిమా కావాలా? లేక భారీ వసూళ్లు రాబట్టే కమర్షియల్ సినిమా కావాలా?” అనే ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. దీనికి విక్రమ్ ఎంతో సమాధానమిస్తూ “నేను కమర్షియల్ సినిమాకే ఓటు వేస్తాను” అని స్పష్టం చేశారు. క్లాసిక్ సినిమాలు ఎంత బాగున్నా అవి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోతే దర్శకులకు, నిర్మాతలకు తదుపరి అవకాశాలు రావడం కష్టమవుతుందని, కాబట్టి పరిశ్రమ మనుగడకు హిట్లు ఇచ్చే కమర్షియల్ సినిమాలే ముఖ్యమని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అలాగే తనకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఎక్కువ ఇష్టమని అన్నారు. అలాగే శ్రియాతో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్తానని అన్నారు. మల్లన్న పాటలో తనే అడిగిందని.. అందుకే తాను శ్రియాతో వెళ్తానని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

మెగాస్టార్ చిరంజీవి ఫోటో..

Vikram, Chiranjeevi

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

Loading...
Unable to load recommendations.
Follow Us