Vijay Devarakonda: ఆ స్టార్ డైరెక్టర్‏తో విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోలేదట.. త్వరలోనే షూటింగ్ అంటూ..

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో

Vijay Devarakonda: ఆ స్టార్ డైరెక్టర్‏తో విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోలేదట.. త్వరలోనే షూటింగ్ అంటూ..
Vijay Devarakonda

Updated on: Nov 20, 2021 | 3:37 PM

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ సినిమాతో అనన్య మొదటి సారి తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. లైగర్ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాడు పూరీ జగన్నాథ్. అయితే ఈ సినిమా కంటే ముందు విజయ్ మరో స్టార్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ చేయాల్సి ఉంది. కానీ అనుకోకుండ పూరీ దర్శకత్వంలో లైగర్ చిత్రాన్ని స్టార్ట్ చేశారు విజయ్ దేవరకొండ. దీంతో శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ్ సినిమా ఆగిపోయిందని అంతా అనుకున్నారు.

కానీ.. తాజా సమాచారం ప్రకారం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ ఆగిపోలేదని విజయ్ సన్నిహితులు అంటున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా జరిగిపోయిందని.. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి.. ఫిబ్రవరి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లుగా తెలిపారు. ఇప్పుడున్న యంగ్ డైరెక్షన్లలో శివ నిర్వాణ ఒకరు. కేవలం సినిమా స్టోరీ మాత్రమే కాకుండా.. స్క్రీన్ ప్లే, మాటలు కూడా తానే సమకూర్చుకుంటాడు శివ. నిన్ను కోరి, మజిలీ వంటి సూపర్ హిట్ చిత్రాలతో సక్సెస్ అయ్యాడు శివ నిర్వాణ. ఇటీవల న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో తెరకెక్కించిన టక్ జగదీష్ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయిన.. మంచి టాక్ సంపాందించుకుంది.

Also Read: Bangarraju: అక్కినేని అభిమానులకు డబుల్ ట్రీట్.. ఫస్ట్ లుక్, టీజర్‏తో బంగార్రాజు సందడి..

Naga Chaitanya: ఇది నా జీవితానికి గ్రీన్‌ సిగ్నల్‌ లాంటిది.. ఆసక్తికరమైన పోస్ట్ చేసిన నాగచైతన్య..

Faria Abdullah : ముద్దమందారం ఈ మనోహరి రూపం.. చిట్టి అందానికి కుర్రాళ్ళు అవ్వకుండా ఉండగలరా దాసోహం..