
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సినిమా రిలీజ్ కంటే ముందు విడుదలైన గ్లింప్స్, ఎంటర్‌టైనింగ్ టీజర్, ట్రైలర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన రెండు పాటల సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ‘కొరియన్ కనకరాజు’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాలో ఓ స్టార్ హీరో డైలాగ్ ను వాడుకున్నారు. ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయిన సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన అమెచ్యూరిష్ అనే డైలాగ్ ను సినిమాలో వాడారు. దీనిపై వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ “అమెచ్యూరిష్” సీన్ నవంబర్ నెలలోనే షూట్ చేశాము. మేము ట్రోల్ చేయలేదు.. ఇమిటేట్ చేశాము అంతే.. గతంలోనూ నేను నటించిన ఎఫ్3 సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేశాం. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ లోనూ ఎన్టీఆర్, కృష్ణ ఇలా చాలా మందిని ఇమిటేట్ చేశాం.. గొప్ప గొప్ప వారిని ఇమిటేట్ చేస్తాం కానీ ట్రోల్ చేయలేము. మాకు ఆ ఉద్దేశం లేదు. ఇమిటేషన్‌కు, ట్రోలింగ్‌కు మధ్య తేడా ఉంటుంది అని వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు.