Tollywood : క్యాబ్ డ్రైవర్ పై సినీ నటుడు దాడి.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుప్రీత్ రెడ్డి. ముఖ్యంగా ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన ఛత్రపతి సినిమాతో విపరీతంగా పాపులర్ అయ్యారు. సుప్రీత్ రెడ్డి ఎక్కువగా విలనిజం పాత్రలు పోషించారు. 2002లో తేజ దర్శకత్వం వహించిన 'జయం' సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు.

Tollywood : క్యాబ్ డ్రైవర్ పై సినీ నటుడు దాడి.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..
Supreeth Reddy

Updated on: Jun 08, 2026 | 11:17 AM

హైదరాబాద్‌లో టాలీవుడ్ నటుడు సుప్రీత్ రెడ్డి (ఛత్రపతి ఫేమ్ కాట్రాజ్) తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. రోడ్డుపై కారు అడ్డంగా ఆపారనే చిన్న కారణంతో ఒక క్యాబ్ డ్రైవర్‌పై ఆయన దౌర్జన్యం చేయడం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో ఈ గొడవ చోటుచేసుకుంది. శ్రీహరి అనే వ్యక్తి ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాగారం చౌరస్తా ప్రాంతంలో ఒక ట్రిప్ పూర్తి చేసుకున్న శ్రీహరి, తదుపరి బుకింగ్ కోసం తన క్యాబ్‌ను రోడ్డు పక్కన నిలిపి వేచి చూస్తున్నాడు. అదే సమయంలో నటుడు సుప్రీత్ రెడ్డి తన ఫార్చునర్ కారులో ఆ మార్గంలో వచ్చారు. అయితే, క్యాబ్ కాస్త రోడ్డుకు అడ్డంగా ఉందనే ఉద్దేశంతో సుప్రీత్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే తన కారు దిగి, డ్రైవర్ శ్రీహరి వద్దకు వెళ్లి అసభ్య పదజాలంతో దూషించడం ప్రారంభించారు. డ్రైవర్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినకుండా, రోడ్డుపై అందరూ చూస్తుండగానే శ్రీహరిపై విచక్షణారహితంగా దాడి చేసి చితకబాదారు.

ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..

నటుడి చేతిలో దెబ్బలు తిన్న క్యాబ్ డ్రైవర్ శ్రీహరి ఘటనా స్థలం నుంచే ‘డయల్ 100’ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. కీసర పోలీసులు తక్షణమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం బాధితుడి రాతపూర్వక ఫిర్యాదు మేరకు పోలీసులు నటుడు సుప్రీత్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గొడవ జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను విశ్లేషించి, ఆధారాల ప్రకారం సుప్రీత్‌కు నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..

సుప్రీత్ రెడ్డి ‘ఛత్రపతి’ సినిమాలో ‘కాట్రాజ్’ పాత్రతో పాటు ‘సై’, ‘మర్యాద రామన్న’, ‘మిర్చి’, ‘దూకుడు’ వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తెరపై విలనిజంతో మెప్పించిన ఈ నటుడు రియల్ లైఫ్‌లో ఇలా రోడ్ రేజ్ వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.

ఎక్కువ మంది చదివినవి : Sirivennela Sitaramasastri : మనిషి జీవితంలో ఎదగటానికి ఈ లక్షణాలు ఉంటే చాలు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి..

ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: ఒకప్పుడు లవర్ బాయ్.. వడ్డె నవీన్ కొడుకును చూశారా.. ? వైరలవుతున్న ఫోటోస్..

Follow Us