Satyadev : హీరోగా ఫస్ట్ ఛాన్స్.. ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ కామెంట్స్..

తెలుగు సినిమా ప్రపంచంలో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు సత్యదేవ్. హీరోగా, ప్రతినాయకుడిగా కనిపించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే హీరోగా తనకు వచ్చిన ఫస్ట్ ఛాన్స్ కోసం రెండు నెలల్లో ఏకంగా 16 కిలోల బరువు తగ్గాడట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Satyadev : హీరోగా ఫస్ట్ ఛాన్స్.. ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ కామెంట్స్..
Satyadev

Updated on: Jun 07, 2026 | 7:44 AM

టాలీవుడ్‌లో ప్రతిభావంతుడైన నటుడిగా సత్యదేవ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. చిన్న చిన్న పాత్రలతో మొదలై, నేడు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ప్రయాణం ఎంతో మంది యువ నటులకు స్ఫూర్తిదాయకం. అయితే, ఆయన కెరీర్‌లో ‘జ్యోతిలక్ష్మి’ సినిమా ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ చిత్రం కోసం సత్యదేవ్ పడిన కష్టం, ఆయన వెనుక ఉన్న కథ తాజాగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సత్యదేవ్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాల ప్రకారం, ‘జ్యోతిలక్ష్మి’ చిత్రంలో మొదట ఆయనకు ఒక చిన్న పాత్ర కోసం మాత్రమే అవకాశం వచ్చింది. కానీ, ఆడిషన్స్ సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ సత్యదేవ్‌ను చూసి ఆశ్చర్యపోయారు. ఆయన సత్యదేవ్‌తో, “నువ్వు కొంచెం లావుగా ఉన్నావు, ఒకవేళ రెండు నెలల్లో బరువు తగ్గితే బాగుంటుంది అని అన్నారట. దీంతో ఆ రెండు నెలలు ఎంతో కష్టపడ్డారట.

ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..

ఆ మాటను సవాలుగా తీసుకున్న సత్యదేవ్, ఆ రెండు నెలలు ఒక తపస్సులా కష్టపడ్డారు. రోజుకు కేవలం ఒక ఆరెంజ్ తింటూ కఠినమైన డైట్ పాటించారు. ఫలితంగా రెండు నెలల్లోనే 16 కిలోల బరువు తగ్గి పూరీ జగన్నాథ్‌ను అవాక్కయ్యేలా చేశారు. ఆయన నిబద్ధతను చూసిన పూరీ, ఆ చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు. సత్యదేవ్ కెరీర్‌లో ఇది ఒక గొప్ప మలుపుగా మారింది.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..

కెరీర్ ఆరంభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు చాలా మంది ఆయనను నిరుత్సాహపరిచారు. “సినిమా అంటే ఎందుకు ఈ పిచ్చి? ఉద్యోగం చేసుకోక” అని సలహాలు ఇచ్చేవారు. కానీ, అవేవీ పట్టించుకోకుండా తన లక్ష్యం వైపు ముందుకు సాగారు. “దేవుడు నిన్ను రాజును చేయాలంటే కిరీటాన్ని ఇవ్వడు, యుద్ధాన్ని ఇస్తాడు” అన్న ఆయన మాటలే ఆయనకు ఉన్న సినిమా పట్ల అంకితభావాన్ని తెలియజేస్తాయి. నేడు కమర్షియల్ హితాల కోసం ఎదురుచూస్తున్నా, విభిన్న కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కష్టపడితే అవకాశాలు ఎలా వస్తాయో చెప్పడానికి సత్యదేవ్ ప్రయాణం ఒక అద్భుత ఉదాహరణ.

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

Loading...
Unable to load recommendations.
Follow Us