Fauji Movie : ప్రభాస్ ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు.. క్లారిటీ ఇచ్చిన వ్యక్తిగత సిబ్బంది..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఫౌజీ. డైరక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్ లో అనుహ్య ఘటన చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రూమర్స్ నటుడి వ్యక్తిగత సిబ్బంది స్పందిస్తూ అసలు క్లారిటీ ఇచ్చారు.

Fauji Movie : ప్రభాస్ ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు.. క్లారిటీ ఇచ్చిన వ్యక్తిగత సిబ్బంది..
Rajesh Sharma

Updated on: Jul 09, 2026 | 8:09 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఫౌజీ. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ సెట్ లో అనుహ్య ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేగంగా జరుగుతుంది. అయితే ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మను విషపురుగు కాటేసినట్లు సమాచారం. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు టాక్. షూటింగ్ ముగిసిన తర్వాత సెట్ లో కొందరు టెక్నీషియన్లతో మాట్లాడుతుండగా.. ఆయన కాలికి విషపు పురుగు కాటేసిందని వార్తలు వచ్చాయి. మొదట అది సాధారణ పురుగే అనుకొని నిర్లక్ష్యం చేశారని.. కానీ ఆరు గంటల తర్వాత తీవ్రమైన నొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రూమర్స్ పై రాజేశ్ శర్మ వ్యక్తిగత సిబ్బంది క్లారిటీ ఇచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Athadu Movie : అతడు సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆయనే.. నాజర్ కామెంట్స్..

నటుడు రాజేశ్ శర్మ గురించి నడుస్తున్న ప్రచారం పై ఆయన పీఏ సుభాశిష్ పాండా స్పందించారు. ఫౌజీ షూటింగులో నటుడుకు కాటేసిందనే ప్రచారాన్ని ఖండిస్తూ వీడియోను రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని.. రాజేశ్ శర్మ కేవలం డయాబెటిస్ కారణంగానే ఆసుపత్రిలో చేరారని.. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారని. గురువారం డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. షూటింగ్ సెట్ లో విషపుపురుగు కాటేసిందని వస్తున్న ప్రచారం నిజం కాదని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?

ఫౌజీ చిత్రాన్ని టీ సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తుండగా.. ఇందులో ప్రభాస్ సరసన ఇమాన్ ఎస్మాయిల్ నటిస్తుంది. అలాగే జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, రాజేశ్ శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..

రాజేశ్ శర్మ పీఏ..

ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..

Follow Us