
తెలుగు చిత్ర పరిశ్రమలో న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు హీరో నాని. వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్నారు. ప్రస్తుతం ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. కొన్నినెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. నాని జిమ్ అసలు జిమ్ చేయరు. ఎప్పుడూ తన జిమ్ వీడియోస్, ఫిట్నెస్ వీడియోస్ సైతం షేర్ చేయరు. గతంలో ఓ ఇంటర్యూలో నాని తన ఈ లుక్ వెనుక ఉన్న రహస్యాలను, తన వ్యక్తిగత ఫిట్‌నెస్ మంత్రాలను వెల్లడించారు. తాను జిమ్‌కు వెళ్లకపోయినా, ఎప్పుడూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఎలా ఉండగలరో ఆయన వివరించారు. కొత్త సినిమా హాయ్ నాన్నలో యవ్వనంగా కనిపించడం గురించి అడిగినప్పుడు, నాని దీనికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. “కొద్దిగా బరువు తగ్గాను. దసరా తర్వాత గడ్డం తీసి, హెయిర్ స్టైల్ మార్చడం వల్ల లుక్ మారింది. కొంచెం హెయిర్ గ్రూమ్డ్ గా ఉంది. చిన్న స్టబుల్ (గడ్డం) ఉండటం వల్ల కూడా నీట్‌గా కనిపిస్తుంది. అలాగే, నా కాస్ట్యూమ్స్, ముంబైకి చెందిన ఓ ఆపరేటెడ్ కంపెనీ డిజైన్ చేయడం వల్ల ఒక క్లాస్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా, సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గీస్ ఒక మెజీషియన్ లాంటివారు. ఆయన బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ వల్ల నాకు ఒక మంచి లుక్ వచ్చింది. ఇవన్నీ కలిపి నాకు ఈ యంగ్ లుక్ రావడానికి దోహదపడ్డాయి” అని నాని స్పష్టం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..
శారీరక శ్రమ, ఆహారపు అలవాట్లపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ, తాను జిమ్‌లో అధిక వ్యాయామాలు, స్ట్రెంత్ ట్రైనింగ్ లేదా వెయిట్ లిఫ్టింగ్ చేయనని నాని తెలిపారు. “నేను కేవలం కార్డియో మాత్రమే చేస్తాను. నేను ఎప్పుడూ స్థిరమైన బరువును కలిగి ఉంటాను. దీనికి ప్రధాన కారణం నేను నిరంతరం పని చేయడమే” అని నాని అన్నారు. “పని చేయడమే అత్యంత ముఖ్యమైన విషయం. మనం ఇంట్లోనే కూర్చుంటే సహజంగానే బరువు పెరుగుతాం. పనిలో నిమగ్నమైతే మనం ఫిట్‌గా ఉండగలం” అని ఆయన వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..
ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, నాని చాలా విలక్షణమైన పద్ధతిని అనుసరిస్తారు. “నేను ప్రతిదీ, ఏదైనా తింటాను” అని ఆయన చెప్పారు. ఆహార నిపుణుడిగా తాను చెప్పలేనప్పటికీ, తన పరిశీలన ప్రకారం, బరువు తగ్గడానికి డైట్లు పాటించేవారు, కొన్ని ఆహారాలు మానేసినవారు దీర్ఘకాలంలో తిరిగి బరువు పెరుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. “శరీరాన్ని టార్చర్ చేయకూడదు. చిన్నప్పటి నుండి మనం ఏ ఆహారానికి అలవాటుపడ్డామో, అదే మన శరీరానికి మంచిది. ఇంట్లో వండిన ఆహారం, అమ్మ చేతి పిండివంటలు వంటి సంప్రదాయ ఆహారాలను కొనసాగించడం మంచిది” అని నాని సూచించారు. “అయితే, ఏదీ అతిగా తినకూడదు” అని ఆయన అన్నారు. ఉన్నపళంగా ఇంట్లో భోజనం మానేసి సలాడ్‌లకు మారితే శరీరం దానికి సిద్ధంగా ఉండదని, ఒత్తిడికి గురవుతుందని నాని హెచ్చరించారు. “ఇది నా అవగాహన” అని చెబుతూ, ఇప్పుడు మళ్లీ అందరూ తమ మూలాలకు తిరిగి వస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు డైట్ల పేరుతో అనేక పద్ధతులు ప్రచారంలో ఉన్నాయని, కానీ అవి దీర్ఘకాలంలో ఆరోగ్యానికి మంచివి కావని అన్నారు. “మీరు ఏదైనా తినండి, కానీ నియంత్రణ, క్రమశిక్షణ కలిగి ఉండండి. అదే జీవితంలో ముఖ్యమైనది” అని నాని తన ఫిట్‌నెస్ గురించి చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‌లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..
ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..