L.B. Sriram: 500పైగా సినిమాలు.. మూవీస్ మానేసి షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి కారణం చెప్పిన నటుడు ఎల్పీ శ్రీరామ్..

తెలుగు సినిమా ప్రపంచంలో నటుడిగా, హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించకున్నారు ఎల్.బి. శ్రీరామ్. కానీ కొన్నాళ్లుగా సినిమాల్లో కనిపించం లేదు. తాజాగా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న సవాళ్లను వెల్లడించారు. 500 చిత్రాలు, ఐదు నంది అవార్డులు సాధించిన ఆయన, టాప్ కమెడియన్‌గా ఉన్నప్పటికీ సెంటిమెంటల్ పాత్రలకే పరిమితం కావడంపై ఆవేదన చెందారు. వైవిధ్యమైన పాత్రల కోసం షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నట్లు తెలిపారు.

L.B. Sriram: 500పైగా సినిమాలు.. మూవీస్ మానేసి షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి కారణం చెప్పిన నటుడు ఎల్పీ శ్రీరామ్..
Lb Sriram

Updated on: Jun 06, 2026 | 11:16 AM

తెలుగు సినిమా రంగంలో సుదీర్ఘకాలం నటుడిగా, రచయితగా సేవలందించిన ఎల్.బి. శ్రీరామ్, తన కెరీర్‌లో ఎదుర్కొన్న విచిత్రమైన సవాళ్లను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన 500కు పైగా చిత్రాలలో నటించి, ఐదు ప్రతిష్ఠాత్మక నంది అవార్డులను గెలుచుకున్నారు. టాప్ కమెడియన్‌లలో ఒకరిగా నిలిచినప్పటికీ, పరిశ్రమ తనను కేవలం సెంటిమెంటల్ లేదా సానుభూతి కలిగించే పాత్రలకే పరిమితం చేస్తోందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నేను టాప్ 10 కమెడియన్స్ లో ఒకడిని అయ్యుండి, నెంబర్ ఆఫ్ వెరైటీ క్యారెక్టర్స్ చేసి, అంత వెర్సటాలిటీ చూపించిన నేను, నన్ను చివర్లో ఒక గాడికి కట్టేశారు. ఒక సెంటిమెంటల్ క్యారెక్టర్ కి, సింపతీ క్యారెక్టర్ కి అయ్యో పాపం, అయ్యో పాపం అని,” అంటూ శ్రీరామ్ తన బాధను తెలియజేశారు. తను చేసిన హాస్య సన్నివేశాలు, ఎమోషనల్ కొటేషన్లు రీల్స్‌లో తరచుగా కనిపిస్తున్నప్పటికీ, దర్శకులు, రచయితలు మాత్రం “నువ్వు చచ్చిపోవాలి సార్,” “నువ్వు ఏడవాలి సార్” వంటి పాత్రలనే ఇస్తున్నారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది కక్షతో చేస్తున్న పని కాదని, ఒక రకమైన “దౌర్భాగ్యం” అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..

తాను హాస్యాన్ని పండించగలను, వైవిధ్యమైన పాత్రలను చేయగలను అని నిరూపించినప్పటికీ, “ఈ వేషం రక్తి కట్టించడానికి మీరు తప్ప ఎవరున్నారు” అని చెప్పడంపై పై ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పాత్రలు ఒప్పుకుంటే, గత ఆరు-ఏడేళ్లుగా ఎప్పుడూ బిజీగా ఉండేవాడినని, ఎందుకంటే అలాంటి పాత్రలకు పోటీ లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, తనలోని నటుడిని, కళాకారుడిని కేవలం ఒకే రకమైన భావోద్వేగాలకు పరిమితం చేయడం తనకు ఇష్టం లేదని ఆయన వివరించారు. సినిమా పరిశ్రమలో రంగులు ఎక్కువగా ఉంటాయని, రాజకీయాల కంటే, క్రికెట్ కంటే విపరీతమైన స్పందన ఇక్కడే ఉంటుందని శ్రీరామ్ చెప్పుకోచ్చారు. తన కోపాన్ని గురించి మాట్లాడుతూ, ఎంత కోపం వచ్చినా అది తాటాకు చప్పుడు లాగానే ఉంటుందని, తప్పు అవతలి వారిదైనా తానే ముందు పలకరిస్తానని తెలిపారు. ఇలాంటి విషయాలలో వైరాన్ని శాశ్వతం చేసుకోకుండా, పేజీ తిప్పేయాలని ఆయన తన జీవిత తత్వాన్ని వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

తన కెరీర్ తొలినాళ్లలో ఒక సినిమాకు డైలాగ్ రైటర్‌గా ఏడాది కష్టపడినా తన పేరు లేకుండా పోయిందని, అది తనను తీవ్రంగా బాధించిందని గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన కూడా తనను వ్యక్తిగతంగా ఎంతో కదిలించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం, వైవిధ్యమైన కథలు, పాత్రల కోసం తాను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నానని, వాటి ద్వారా తన నటనకు కొత్త కోణాలను అన్వేషిస్తున్నానని ఎల్.బి. శ్రీరామ్ వెల్లడించారు. సినిమా రంగం తనను మరో కోణంలో చూడాలని, తన బహుముఖ ప్రజ్ఞను గుర్తించాలని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..

 

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

Follow Us