
తెలుగు ప్రేక్షకులకు ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు సుపరిచితమే… ప్రస్తుతం పవర్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న జగ్గుభాయ్… వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారారు. సెకండ్ ఇన్సింగ్‌లో విలన్ గా, తండ్రిగా, వ్యాపారవేత్తగా ఆయన పోషిస్తున్న పాత్రలు ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తున్నాయి. ఒకప్పుడు ఆర్థికంగా నష్టపోయిన జగపతిబాబు మళ్లీ సినిమాలు వరుసగా రావడంతో ఆర్ధికంగా, సినిమాల పరంగా నిలబడ్డారు. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా జగపతి బాబు ఇప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్‌గా మారారు. అయితే ఇటు సినిమాల పరంగానే కాకుండా.. అటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవల ఆనందయ్య కరోనా మందు, ఆయుర్వేదం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జగ్గుభాయ్ నయా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అందులో తెల్ల కుర్తా, పైజామా ధరించిన జగపతి బాబు.. చేతిలో నల్ల కళ్లద్దాలు, పట్టుకుని గోడపై కూర్చొని సీరియస్‌గా చూస్తూ ఫోటోకు పోజిచ్చారు. త్వరలోనే ఏమైనా పాలిటిక్స్‌లోకి అడుగు పెడుతున్నారా ? అని అభిమానులు సందేహం వ్యక్తం చేయగా.. రాజకీయ నాయకుడిగా మాత్రం ఉండాలనుకోవడం లేదు అని క్యాప్షన్ ఇచ్చి క్లారిటీ ఇచ్చాడు. దీంతో మంచి నిర్ణయం తీసుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేసున్నారు. అలాగే మరికొంత మంది సినిమాల్లో పొలిటికల్ పాత్ర చేయండంటూ సూచిస్తున్నారు.
ట్వీట్..
Also Read: Happy Birthday Sourav Ganguly: 49వ వసంతంలోకి బెంగాల్ టైగర్.. విదేశాల్లో విజయాలకు కేరాఫ్ అడ్రస్..!
Heavy Rains: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం.. 11న అల్పపీడనం