Nandamuri Balakrishna: బాలయ్య సినిమా కోసం మరో పవర్ ఫుల్ విలన్.. రంగంలోకి ఆ స్టార్ హీరో..

ఒకప్పుడు స్టార్ హీరోలు గా రాణించిన వాయు ఇప్పుడు విలన్ పాత్రలతో మెప్పిస్తున్న విషయం తెలిసిందే.. హీరోలుగా క్రేజ్ తగ్గిన తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు విలన్స్ గా ఆకట్టుకుంటున్నారు.

Nandamuri Balakrishna: బాలయ్య సినిమా కోసం మరో పవర్ ఫుల్ విలన్.. రంగంలోకి ఆ స్టార్ హీరో..
Balakrishna

Updated on: Dec 31, 2021 | 7:51 AM

Arjun Sarja: ఒకప్పుడు స్టార్ హీరోలుగా రాణించిన వారు ఇప్పుడు విలన్ పాత్రలతో మెప్పిస్తున్న విషయం తెలిసిందే.. హీరోలుగా క్రేజ్ తగ్గిన తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు విలన్స్ గా ఆకట్టుకుంటున్నారు. అందుకు సాలిడ్ ఉదాహరణ జగపతిబాబు. ఒకప్పుడు హీరోగా రాణించిన జగపతి బాబు బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో విలన్ గా మారారు. ఈ సినిమాతో జగపతి బాబు క్రేజ్ అమాంతం పెరిగింది. వరుసగా విలన్ ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పుడు అదే బాటలో హీరో శ్రీకాంత్ కూడా నడుస్తున్నారు. ఇటీవలే అఖండ సినిమా శ్రీకాంత్ విలన్ గా  నటించి మెప్పించారు. విలన్ పాత్రలో శ్రీకాంత్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో శ్రీకాంత్ కు విలన్ ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

దాంతో బాలయ్య వరుసగా తన సినిమాల్లో ఇలా హీరోలను విలన్స్ గా మార్చేస్తున్నారు. ఇప్పుడు మరో హీరో కూడా బాలకృష్ణ కోసం విలన్ గా నటించనున్నారని తెలుస్తుంది. అఖండ సినిమాతో ఘన విజయం సాధించిన బాలయ్య ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమా కోసం సిద్దమవుతున్నాడు. బాలయ్య కోసం అదిరిపోయే మాస్ మసాలా కథను సిద్ధం చేశాడట గోపీచంద్. ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ ను రంగంలోకి దింపుతున్నారట.. కన్నడ తో పాటు సౌత్ లో అన్ని భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉన్న యాక్షన్ కింగ్ అర్జున్ ను ఈ సినిమా లో విలన్ పాత్రకు గాను ఎంపిక చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు విలన్ పాత్రల్లో కనిపిస్తున్నాడు. మరి బాలయ్య సినిమాలో అర్జున్ విలన్ అన్న వార్తల పై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Coronavirus: బాలీవుడ్‌లో ఆగని కరోనా ప్రకంపనలు.. వైరస్‌ బారిన పడిన బాహుబలి ‘మనోహరి’

Prabhas: డార్లింగ్‌ మనసు బంగారం.. రాధేశ్యామ్‌ ప్రీరిలీజ్‌లో గాయ పడిన అభిమానుల కోసం..

Jr.NTR: ఆ సమయంలో డిప్రెషన్‏లోకి వెళ్లాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్..

Loading...
Unable to load recommendations.
Follow Us