Vivaha Bhojanambu: ‘ఏబీసీడీ.. నువ్వు నా జోడి’.. ‘వివాహభోజనంబు’ నుంచి తొలి పాట విడుదల..

ABCD Song From Vivaha Bhojanambu: యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ నిర్మాతగా మారి వివాహ భోజనంబు అనే సినిమా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. అయితే సందీప్‌ ఇదే పేరుతో హైదరాబాద్‌తో పాటు..

Vivaha Bhojanambu: ఏబీసీడీ.. నువ్వు నా జోడి.. వివాహభోజనంబు నుంచి తొలి పాట విడుదల..
Vivaha Bhojanambu

Updated on: Feb 04, 2021 | 4:54 AM

ABCD Song From Vivaha Bhojanambu: యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ నిర్మాతగా మారి వివాహ భోజనంబు అనే సినిమా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. అయితే సందీప్‌ ఇదే పేరుతో హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల రెస్టారెంట్లు కూడా నిర్వహిస్తుండడం విశేషం.
ఇక సందీప్‌ ప్రొడ్యుసర్‌గా మారి తెరకెక్కిస్తోన్న ‘వివాహభోజనంబు’ సినిమాలో కమెడియన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సత్య హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమాలో తొలి పాటను విడుదల చేసింది.. ‘ఏబీసీడీ.. నువ్వు నా జోడి’ అని సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. అనిరుద్ విజయ్ (అనివీ) సంగీతం అందించిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించాడు. ఇక ఈ పాటకు రోల్‌ రైడా ర్యాప్‌ పాడడం మరో విశేషం. ప్రస్తుతం ‘ఏబీసీడీ’ పాటకు మంచి స్పందన వస్తోంది. మరి ఈ పాటపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: బ్లాక్ బస్టర్ హిట్ మూవీకి సీక్వెల్ స్టార్ట్ చేయనున్న యంగ్ హీరో.. వచ్చే నెలలో సెట్స్ పైకి..

Loading...
Unable to load recommendations.
Follow Us