72nd National Film Awards 2026: 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే.. తెలుగు నుంచి ఎవరంటే

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక భారతీయ సినీ రంగంలోని ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ముఖ్యంగా అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ‘ఆర్టికల్ 370’కు ఉత్తమ చిత్రం, యామీ గౌతమ్‌కు ఉత్తమ నటి, మమ్ముట్టి–కార్తిక్ ఆర్యన్‌లకు సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

72nd National Film Awards 2026: 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే.. తెలుగు నుంచి ఎవరంటే
72nd National Film Awards

Updated on: Sep 22, 2026 | 6:12 PM

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల 72వ ప్రదానోత్సవం సెప్టెంబర్ 22న గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో ఘనంగా జరిగింది. 2024లో భారతదేశంలో విడుదలైన చిత్రాలు, నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్స్ ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డులను అందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ ఏడాది జాతీయ అవార్డుల వేడుకకు ఏక్తా నగర్ వేదిక కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాతీయ చలనచిత్ర అవార్డులను ఇకపై దేశంలోని వివిధ రాష్ట్రాలు, నగరాల్లో నిర్వహించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగానే తొలిసారి జాతీయ రాజధాని వెలుపల ఈ వేడుకను నిర్వహించారు.

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఆర్టికల్ 370 చిత్రానికి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కింది. ఈ చిత్రంలో నటించిన యామీ గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. 2024లో విడుదలైన చిత్రాల్లో ఈ మూవీకి జాతీయ స్థాయిలో కీలక గుర్తింపు లభించింది. ఉత్తమ నటుడి విభాగంలో ఈసారి ఇద్దరు నటులు అవార్డును అందుకున్నారు. మమ్ముట్టి ‘బ్రమయుగం’ చిత్రంలోని నటనకు, కార్తిక్ ఆర్యన్ ‘చందు ఛాంపియన్’లో తన నటనకు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ తదితరులు నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి ‘బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్’ అవార్డు లభించింది. మరోవైపు ‘అమరన్’ చిత్రానికి దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామికి ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. అలాగే నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు సినిమాకు అవార్డు దక్కింది.

బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రూల్ పార్ట్-02’ కూడా జాతీయ అవార్డుల్లో సత్తా చాటింది. ఈ చిత్రానికి ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, కాస్ట్యూమ్ డిజైన్ విభాగాల్లో గుర్తింపు లభించింది. స్త్రీ 2కు కొరియోగ్రఫీ విభాగంలో అవార్డు దక్కగా, మహారాజాకు యాక్షన్ డైరెక్షన్ విభాగంలో పురస్కారం లభించింది. నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రణదీప్ హుడా,  స్వాతంత్ర్య వీర్ సావర్కర్ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. ఈ చిత్రం ఆయనకు దర్శకత్వ రంగంలో జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చింది. ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం సాగించిన ఆయన 300కు పైగా చిత్రాల్లో, ఆరు భారతీయ భాషల్లో నటించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఫీచర్ ఫిల్మ్స్‌తో పాటు నాన్-ఫీచర్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్, యానిమేషన్, సినిమా రచన వంటి విభాగాల్లోనూ ప్రతిభకు గుర్తింపు లభించింది. వివిధ భారతీయ భాషలకు చెందిన చిత్రాలు, కళాకారులు అవార్డులు అందుకోవడం దేశంలోని భాషా, సాంస్కృతిక, సినీ వైవిధ్యాన్ని మరోసారి చాటిచెప్పింది.

ఇవి కూడా చదవండి

కొత్త బంగారు లోకం జోడీ మరోసారి సందడి.. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నయా మూవీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us