Cinema: 2025లో రిలీజైన పరమ బోరింగ్ సినిమా.. థియేటర్లలో నిద్రపోయిన ఆడియెన్స్.. కట్ చేస్తే ఇప్పుడు ఓటీటీలో..

సుమారు 2 గంటల 10 నిమిషాల రన్ టైమ్ తో తెరకెక్కిన ఈ మూవీ 2025లో రిలీజైన అత్యంత బోరింగ్ సినిమాగా నిలిచింది. థియేటర్‌లో ఈ సినిమా చూస్తూ ఆడియెన్స్ నిద్రపోయారని రివ్యూలు వచ్చాయి. మరి ఈ సినిమా ఏదో తెలుసుకుందాం రండి..

Cinema: 2025లో రిలీజైన పరమ బోరింగ్ సినిమా.. థియేటర్లలో నిద్రపోయిన ఆడియెన్స్.. కట్ చేస్తే ఇప్పుడు ఓటీటీలో..
The Diplomat Movie

Updated on: Mar 15, 2026 | 12:26 PM

ప్రతి సంవత్సరం బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు విడుదలవుతాయి. వీటిలో కొన్ని సినిమాలు హిట్ అవుతాయి. భారీ లాభాలను ఆర్జించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాయి. మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి. ఇంకొన్ని సినిమాలు యావరేజ్ టాక్ తో ఓ మోస్తరు వసూళ్లను రాబడుతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. గతేడాది ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. మొదటి షో నుంచే యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఓవరాల్ గా బడ్జెట్ కంటే రెట్టింపు వసూళ్లనే రాబట్టింది. మీడియా నివేదికల ప్రకారం ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 20 కోట్లు. అయితే దాదాపు రూ. 40 కోట్ల వరకు ఈ మూవీకి వసూళ్లు వచ్చాయి. కానీ ఈ సినిమాకు చాలా వరకు నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. చాలా మంది విమర్శకులు ఈ చిత్రానికి కేవలం 3/5 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. మరోవైపు, ఈ చిత్రానికి IMDbలో 7.9/10 మంచి రేటింగ్ వచ్చింది. ఈ సినిమా గురించి మరో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే .. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఓటీటీలోనూ పెద్దగ ఆడలేదు.

ఈ బాలీవుడ్ సినిమా పేరు ది డిప్లొమాట్. మార్చి 14, 2025న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. కండల వీరుడు జాన్ అబ్రహం ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే సాదియా ఖేతబ్‌, కుముద్‌ మిశ్రా, రేవతి, షరీబ్‌ హష్మి తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. శివమ్‌ నాయర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇండియా- పాకిస్తాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో యదార్థ సంఘటనలతో ఈ మూవీని తెరకెక్కించారు. కథ బాగానే ఉన్నా దానిని ఎంగేజింగ్ గా తెరకెక్కించడంలో మేకర్స్ తడబడ్డారని ఈ మూవీకి రివ్యూలు వచ్చాయి.

ఒక ఇంటర్వ్యూలో జాన్ అబ్రహ ది డిప్లోమాట్ సినిమా గురించి చాలా ఆసక్తికర కామెంట్స్ చేశారు. చాలా OTT ప్లాట్‌ఫామ్‌లు ఈ సినిమాను తీసుకోవానికి ఆసక్తి చూపించలేదు. సినిమా స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉండడమే దీనికి ప్రధాన కారణమని జాన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే సబ్ టైటిల్స్ తో ఈ మూవీని ఎంజాయ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us