
సినిమా కెరీర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) . వరుస విజయాలు సొంతం చేసుకుని బడా దర్శకులు, నిర్మాతల దృష్టిలో పడ్డాడు. రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కల్యాణమండపం (SR Kalyana Mandapam) సినిమాలతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ కడప హీరో త్వరలో ‘సెబాస్టియన్ పి సి 524’ (Sebastian PC 524) తో మరోసారి మనల్ని అలరించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 25న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు కిరణ్ అబ్బవరం పుట్టినరోజును పురస్కరించుకుని ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. అయితే అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లా నాయక్ (Bheemal Nayak)’ కూడా రిలీజయ్యే అవకాశం ఉంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రాన్ని పరిస్థితులకు అనుగుణంగా ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న ‘భీమ్లానాయక్’ సినిమాని విడుదల చేస్తామని ఇటీవల దర్శక నిర్మాతలు ప్రకటించారు.
ఫస్ట్ షో రచ్చ పవర్ స్టార్ మూవీతోనే..
ఈక్రమంలో తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ఈ హీరోకు ఓ ఆసక్తికర ప్రశ్న సందించాడు. ‘ ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ విడుదల ఉందని మీకు తెలియదా భయ్యా.. ఆరోజే మీ ‘సెబాస్టియన్ పి సి 524′ ను రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన మీరు అదే రోజు మీ సినిమాను విడుదల చేస్తారు.’ అని అడిగాడు. దీనికి స్పందించిన యంగ్ హీరో ..’నేను మీకంటే కాస్త ఎక్కువగానే ‘భీమ్లా నాయక్’ కోసం ఎదురు చూస్తున్నాను.. ఆరోజు నా సినిమా విడుదల అయినా కూడా.. నేను పవర్ స్టార్ సినిమాకే మొదటి షో వెళతాను.. ఫస్ట్ షో రచ్చ ఆయన మూవీ తోనే’.. అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకు తెగ నచ్చేసింది. సెబాస్టియన్ పి సి 524 తో పాటు ప్రస్తుతం ‘సమ్మతమే’, ‘వినరో భాగ్యము విష్ణు కథా’ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు కిరణ్.
Also Read:Coronavirus: కరోనా బారిన పడిన రజనీకాంత్ కూతురు ఐశ్వర్య.. ఆస్పత్రిలో చికిత్స..
Megastar Chiranjeevi: మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్.. అభిమాని కుటుంబానికి ఏం చేశారో తెలుసా?