Tiktok Star Durga Rao : సినిమాల్లోకి అడుగు పెడుతున్న దుర్గారావు.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ !

|

Dec 31, 2020 | 7:56 PM

టిక్ టాక్ అనే యాప్ ద్వారా చాలా మంది తమలో దాగి ఉన్న యాక్టింగ్ టాలెంట్ ను కామెడీ టాలెంట్ ను బయటపెట్టారు...

Tiktok Star Durga Rao : సినిమాల్లోకి అడుగు పెడుతున్న దుర్గారావు.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ !
Follow us on

Tiktok Star Durga Rao : టిక్ టాక్ అనే యాప్ ద్వారా చాలా మంది తమలో దాగి ఉన్న యాక్టింగ్ టాలెంట్ ను,కామెడీ టాలెంట్ ను బయటపెట్టారు. చాలా మంది ఈ యాప్ ద్వారా ఫెమస్ కూడా అయ్యారు. చాలా మంది భారీ అభిమానులను కూడా సంపాదించుకున్నారు. వారిలో దుర్గారావు కూడా ఒకరు. దుర్గారావు తన డ్యాన్స్ లతో నెటిజన్లను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా’పలాస’సినిమాలో”మీ బావగారు వచ్చేటి వేళ ” అనే పాటకు తనదైన స్టైల్ లో డ్యాన్స్ వేసి చాలా ఫెమస్ అయ్యారు.

అయితే ఇప్పుడు దుర్గారావుకు అదిరిపోయి ఆఫర్ వచ్చింది. ఆయన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అదికూడా చిన్న సినిమాలో కాదు ఏకంగా మాస్ రాజా రవితేజ నటిస్తున్న’క్రాక్’సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నారు దుర్గారావు. డైరెక్టర్ గోపీచంద్ దుర్గారావు టిక్ టాక్ వీడియోస్ జబర్దస్త్ వీడియోలు చూసి పిలిచి.. అతనితో ఓ మంచి కామిక్ పాత్ర చేయించినట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమాలో దుర్గారావు ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. ఇక”క్రాక్”సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 14 న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ALSO READ : Deepika Padukone : అవమానాలన్నీ ఛాలెంజ్‌‌‌‌‌‌‌గా తీసుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా..