
ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే డిజిటల్ ఆడియన్స్‌ను థ్రిల్ చేయడానికి సన్ నెక్స్ట్ (Sun NXT) ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఒక సరికొత్త మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌తో సిద్ధమైంది. అదే కన్నడ చిత్రం ‘కమల్ శ్రీదేవి’. ఐఎండీబీ (IMDb)లో 7.8 వంటి అద్భుతమైన రేటింగ్‌ను సొంతం చేసుకున్న ఈ ఇన్వెస్టిగేషన్ డ్రామా, జులై 17 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా వెల్లడైంది. బెంగళూరులోని ఒక బిజీ మార్కెట్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన ‘శ్రీదేవి’ అనే మహిళ దారుణ హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కమల్ అనే వ్యక్తి శ్రీదేవిని ప్రమాదం నుంచి కాపాడాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తాడు. కానీ అతను రంగంలోకి దిగేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. శ్రీదేవి జీవితం ఒక పెద్ద విషాదంతో ముగుస్తుంది. అసలు ఆమెను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆ మార్కెట్ గల్లీల్లో దాగి ఉన్న డార్క్ సీక్రెట్స్ ఏంటి? కమల్ ఈ విచారణలో ఎలా భాగమయ్యాడు అనేది ఈ సినిమా కథ.
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..
ఈ కన్నడ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మెయిన్ హైలైట్ దీని నెరేషన్ స్టైల్. ఒకే ఒక్క మర్డర్ మిస్టరీని ఏకంగా ఏడుగురు వేర్వేరు వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించబోతున్నారు. సినిమా హిస్టరీలో ‘రషోమోన్ ఎఫెక్ట్’ అని పిలిచే ఈ స్క్రీన్‌ప్లే ప్యాటర్న్ ఆడియన్స్‌కు నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ప్రతి క్యారెక్టర్ చూసే కోణం మారుతున్న కొద్దీ కిల్లర్ ఎవరనే సస్పెన్స్ మరింత ముదురుతుంది. ఒకరు చెప్పే నిజం ఇంకొకరు చెప్పే అబద్ధంతో క్లాష్ అవుతున్నప్పుడు వచ్చే థ్రిల్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
ఇటీవల కాలంలో కన్నడ పరిశ్రమ నుంచి వస్తున్న రా అండ్ రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్లకు ఓటీటీలో విపరీతమైన డిమాండ్ ఉంది. బెంగళూరు మార్కెట్ వాతావరణాన్ని, అక్కడి చీకటి గల్లీలను చాలా రియలిస్టిక్‌గా క్యాప్చర్ చేసిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్‌గా నిలవనుంది. దీనికి తోడు సీన్లలో వచ్చే సస్పెన్స్‌ను ఎలివేట్ చేసేలా ఇచ్చిన ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఫీలింగ్ ఇస్తుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడే వారు జులై 17 నుంచి సన్ నెక్స్ట్‌లో ఈ సినిమాను చూసి ఆస్వాదించవచ్చు.
ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..
ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..