Tollywood : నాగార్జున, చిరంజీవికి లక్కీ హీరోయిన్.. కట్ చేస్తే.. నాగచైతన్యకు కోడలిగా కనిపించింది..

టాలీవుడ్‌లో అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జునలతో జతకట్టి స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. ఇప్పుడు 44 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. అక్కినేని నాగార్జున సరసన నాయికగా నటించిన ఈ అందాల భామ, ఐకానిక్ చిత్రంలో నాగచైతన్యకు కోడలి పాత్రను పోషించడం విశేషం.

Tollywood : నాగార్జున, చిరంజీవికి లక్కీ హీరోయిన్.. కట్ చేస్తే.. నాగచైతన్యకు కోడలిగా కనిపించింది..
Chiranjeevi, Nagarjuna, Nag

Updated on: Nov 06, 2026 | 2:40 PM

సినీ పరిశ్రమలో కొందరు హీరోయిన్లు తమ అందం, నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరిస్తూ చెరగని ముద్ర వేస్తారు. అలాగే కొన్ని జోడీలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. సదరు హీరోహీరయిన్లు కలిసి నటిస్తే చూడాలని కోరుకుంటారు. అలాంటి జోడీలు సైతం టాలీవుడ్ లో చాలా ఉన్నాయి. మరోవైపు ఒకే జనరేషన్‌లోని అగ్ర కథానాయకులతో జతకట్టి విజయాలు సాధించిన పలువురు హీరోయిన్స్, ఆ తర్వాత మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా విభిన్నమైన పాత్రలతో అలరిస్తుంటారు. అలా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఏలి.. చిరంజీవి, నాగార్జున సరసన బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. కట్ చేస్తే అదే హీరోయిన్ దశాబ్దాల తర్వాత నాగచైతన్యకు కోడలిగా కనిపించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తను మరెవరో కాదు సీనియర్ బ్యూటీ శ్రియా శరన్.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవితో ‘ఠాగూర్’, అక్కినేని నాగార్జునతో ‘నేనున్నాను’, వెంకటేశ్, నందమూరి బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలందరి సరసన బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను అందుకుంది శ్రియ. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తన సత్తా నిరూపించుకుంది. అయితే నాగార్జున సరసన హీరోయిన్‌గా నటించిన ఈ భామ, ఆ తర్వాత నాగచైతన్యకు కోడలి పాత్రలో నటించడం విశేషం.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటించిన అద్భుతమైన క్లాసిక్ చిత్రం ‘మనం’. ఈ సినిమాలో నాగార్జున-శ్రియల జోడీ ఎంతో ఆకట్టుకుంది. అయితే ఇందులో పునర్జన్మల నేపథ్యం ఉన్న కథ కావడంతో.. నాగచైతన్య పాత్రకు కొడుకుగా నాగార్జున జన్మిస్తారు. ఆ క్రమంలో నాగార్జున భార్యగా నటించిన శ్రియ, వరుసకు నాగచైతన్యకు కోడలి పాత్రను పోషించినట్లయింది. ఈ ఆసక్తికరమైన రోల్ లింక్ అప్పట్లో సినీ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం 44 ఏళ్ల వయసులోనూ శ్రియా శరన్ తన ఫిట్‌నెస్‌తో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. పాతికేళ్ల అమ్మాయిలా కనిపిస్తూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తోంది. వివాహమై ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘RRR’, ‘దృశ్యం 2’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులతో హిట్స్ అందుకుంది. ఇప్పుడు ఆమె వరుస అవకాశాలు సాధిస్తూ దూసుకుపోతోంది.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

శ్రియా శరణ్..

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Loading...
Unable to load recommendations.
Follow Us