అందుకే శ్రుతీ అంటే నాకు చాలా ఇష్టం: తమన్నా

| Edited By:

Jun 05, 2020 | 7:19 PM

శ్రుతీహాసన్, తమన్నా ఇద్దరూ మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి ఇంతవరకు ఒక్క చిత్రంలో కూడా నటించనప్పటికీ..

అందుకే శ్రుతీ అంటే నాకు చాలా ఇష్టం: తమన్నా
Follow us on

శ్రుతీహాసన్, తమన్నా ఇద్దరూ మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి ఇంతవరకు ఒక్క చిత్రంలో కూడా నటించనప్పటికీ.. వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ ఇద్దరు కలిసి అప్పుడప్పుడు ఫారిన్‌ టూర్‌లకు కూడా వెళుతుంటారు. ఇక తాను మగవాడిగా పుట్టి ఉంటే తమన్నాను పెళ్లి చేసుకునే దాన్నంటూ ఓ ఇంటర్వ్యూలో మిల్కీ బ్యూటీపై తన ఇష్టాన్ని వెల్లడించింది శ్రుతీ. ఇదిలా ఉంటే తాజాగా తమన్నా, శ్రుతీపై తన ప్రేమను వ్యక్తపరిచింది.

ఇండస్ట్రీలోని నటులలో నాకు శ్రుతీహాసన్ చాలా ఇష్టం. తన నాకు మంచి స్నేహితురాలు. ముంబయిలో మా ఇంటికి దగ్గర్లోనే వాళ్ల ఇళ్లు. అందుకే తరచూ కలుసుకునేవాళ్లం. మేమిద్దరం కలిశామంటే మా జీవితాల గురించే ఎక్కువ మాట్లాడుకుంటుంటాం. శ్రుతీకి నెగిటివిటీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆ గుణమే తామిద్దరం మంచి స్నేహితులమయ్యేలా చేసింది. అంతేకాదు శ్రుతీ నన్ను ఇప్పటికీ ఓ చిన్న పిల్లలా చూస్తుంది అని తమన్నా పేర్కొంది. కాగా ప్రస్తుతం శ్రుతీ హాసన్ తెలుగులో పవన్ కల్యాణ్‌ సరసన వకీల్ సాబ్, రవితేజ సరసన క్రాక్‌లో నటిస్తోంది. మరోవైపు తమన్నా, గోపిచంద్ సరసన సిటీ మార్, హిందీలో నవాజుద్దీన్ సిద్దిఖ్వీ సరసన బోలే చుడీయాన్ చిత్రాల్లో నటిస్తోంది.

Read This Story Also: ప్రభుత్వ అధికారిపై బీజేపీ నేత, టిక్‌టాక్‌ స్టార్ ‘చెప్పు’ దాడి..!