బాలీవుడ్‌లో రీమేక్ కానున్న దళపతి విజయ్ ‘మాస్టర్’.. హీరోలుగా ఎవరు నటించనున్నారంటే.!!

Master Movie Remake: తమిళ అగ్రనటులు విజయ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో దర్శకుడు లోకేష్ కనకరాజు తెరకెక్కించిన చిత్రం ‘మాస్టర్’...

  • Ravi Kiran
  • Publish Date - 1:14 pm, Sun, 17 January 21
బాలీవుడ్‌లో రీమేక్ కానున్న దళపతి విజయ్ 'మాస్టర్'.. హీరోలుగా ఎవరు నటించనున్నారంటే.!!

Master Movie Remake: తమిళ అగ్రనటులు విజయ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో దర్శకుడు లోకేష్ కనకరాజు తెరకెక్కించిన చిత్రం ‘మాస్టర్’. మాళవిక మోహనన్, ఆండ్రియా జర్మియా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినమకు అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు. సంక్రాంతి కానుకగా తమిళంతో పాటు తెలుగు భాషల్లో జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. దళపతి విజయ్ పాత్ర కోసం బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. అలాగే భవానీ పాత్రలో మరోసారి విజయ్ సేతుపతినే నటించనున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: గూగుల్ కీలక నిర్ణయం.. సుమారు 200 లోన్ యాప్స్ ప్లేస్టోర్‌లో తొలగింపు..