త్రివిక్రమ్​తో మూవీ : రేసులో బాబాయి-అబ్బాయి..!

|

Jun 27, 2020 | 10:41 PM

ఈ ఏడాది పొంగ‌ల్ కు రిలీజైన‌ 'అల.. వైకుంఠపురములో' చిత్రంతో ఘనవిజయం సొంతం చేసుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్. ఇదే జోరులో తన నెక్ట్స్ మూవీ యంగ్​టైగర్​ ఎన్టీఆర్​తో చేస్తున్నట్లు ప్రకటించాడు.

త్రివిక్రమ్​తో మూవీ : రేసులో బాబాయి-అబ్బాయి..!
Follow us on

ఈ ఏడాది పొంగ‌ల్ కు రిలీజైన‌ ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో ఘనవిజయం సొంతం చేసుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్. ఇదే జోరులో తన నెక్ట్స్ మూవీ యంగ్​టైగర్​ ఎన్టీఆర్​తో చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘ఆర్ఆర్ఆర్’​ షూటింగులో తారక్​ బిజీగా ఉన్నందున‌.. ఆ చిత్రీక‌ర‌ణ‌​ పూర్తయిన తర్వాత కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించాలని భావించింది మూవీ యూనిట్. కానీ, అనుకోకుండా కరోనావైర‌స్ వ్యాప్తి చెంద‌డంతో ప్లానింగ్స్ అన్నీ మారిపోయాయి. ఈ క్రమంలో తారక్​-త్రివిక్రమ్​ల కొత్త మూవీ కాస్త లేటుగా స్టార్ట్ అవ్వొచ్చని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్​తో మూవీ కంప్లీట్ అయిన‌ తర్వాత త్రివిక్రమ్​ ఏ హీరోతో సినిమా తెరకెక్కించనున్నాడనే విషయమై సినీ పరిశ్రమలో వార్త‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. గురూజీ దర్శకత్వంలో నటించేందుకు పవన్ కల్యాణ్, రామ్​చరణ్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్​ టాక్ ప్ర‌కారం తారక్​ మూవీ తర్వాత త్రివిక్రమ్ చెర్రీని డైరెక్ట్​ చేస్తాడని చర్చ జరుగుతోంది. కానీ, తన తదుపరి సినిమా కోసం పవన్​ కల్యాణ్​ ఇప్పటికే హారికా, హాసినీ నిర్మాణ సంస్థ నుంచి అడ్వాన్స్​ తీసుకున్నాడని సమాచారం. దీన్ని బట్టి చూస్తే పవన్​ కల్యాణ్​తోనే త్రివిక్రమ్ తన కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడ‌ని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చెయ్యాలి.