Rajinikanth Annaathe : శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సూపర్ స్టార్ ‘అన్నాత్తే’ సినిమా

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ ప్రధానపాత్రలో ‘సిరుతై’ శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘అన్నాత్తే’. ఖుష్బూ, మీనా, నయనతార హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, సూరి, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Rajinikanth Annaathe : శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సూపర్ స్టార్ ‘అన్నాత్తే’ సినిమా

Updated on: Apr 23, 2021 | 6:24 AM

Rajinikanth Annaathe : సూపర్‌స్టార్ రజనీకాంత్‌ ప్రధానపాత్రలో ‘సిరుతై’ శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘అన్నాత్తే’. ఖుష్బూ, మీనా, నయనతార హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, సూరి, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. లాక్‌డౌన్ విధించే సమయానికి ఈ మూవీ షూటింగ్ దాదాపు‌ 50 శాతం పూర్తి అయ్యింది.  ఆ తరవాత ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేయాలని దర్శకనిర్మాతలు భావించారు. అయితే అదే సమయంలో సూపర్ స్టార్ ఓ భారీ అనౌన్స్ మెంట్ చేశారు. అదే పొలిటికల్ ఎంట్రీ.

కోదిరోజులు షూటింగ్ ను పక్కన పెట్టి ఆయన పార్టీ ఏర్పాటు పనులపై బిజీ బిజీగా తిరిగారు. సరిగ్గా మరి కొద్దీ రోజుల్లో పార్టీ పేరు అనౌన్స్ చేద్దామనుకునే లోగా ఆయన అనారోగ్యం పాలయ్యారు. దాంతో రజినీకాంత్ ఆరోగ్యం సహరించక పోవడంతో పొలిటికల్ ఎంట్రీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు  ‘అన్నాత్తే’ షూటింగ్ ను పూర్తి చేయాలనీ సూపర్ స్టార్ భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఫిబ్రవరి నాటికే షూట్ కంప్లీట్ చేసి మార్చి లేదా ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ అది కుదిరేలా లేదు. ఇక షూటింగ్ ప్రారంభమైన తర్వాత మొదటగా ఇంటర్వెల్ సీన్స్ ను షూట్ చేస్తారని సమాచారం. ఆ తరువాత రజని – ఖుష్బూ మధ్య వచ్చే ఫ్యామిలీ సీన్స్ తీస్తారని తెలుస్తోంది. మరిఈ మూవీ ఎప్పటికి పూర్తవుతుందన్నదానిమీద క్లారిటీ రావాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarrainodu Movie: అల్లు అర్జున్‌ ‘సరైనోడు’కు ఐదేళ్లు.. రికార్డులను క్రియేట్ చేసి సంచలనం సృష్టించిన మూవీ

భార్గవ్ అమ్మాయిలను గౌరవించడు.. అతనో వుమెనైజర్.. షాకింగ్ విషయాలు చెప్పిన మరో అమ్మాయి..

న్యూయార్క్ పయనమైన షారుఖ్ కుటుంబం.. కరోనా నుంచి తప్పించుకునేందుకేనా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Loading...
Unable to load recommendations.
Follow Us