Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. జబర్దస్త్ నుంచి ఔట్!

జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమంది కమెడియన్లు, టెక్నిషియన్లకు లైఫ్ ఇచ్చింది. అంతే స్థాయిలో జనాలకు ఎంటైర్‌టైన్మెంట్‌ కూడా అందిస్తోంది.

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. జబర్దస్త్ నుంచి ఔట్!
Sudigali Sudheer

Updated on: Nov 13, 2021 | 7:37 PM

జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమంది కమెడియన్లు, టెక్నిషియన్లకు లైఫ్ ఇచ్చింది. అంతే స్థాయిలో జనాలకు ఎంటైర్‌టైన్మెంట్‌ కూడా అందిస్తోంది. కాస్త బోల్డ్ పంచ్‌లు పేలుతుంటాయన్న పేరు ఉన్నప్పటికీ.. ఈ షోకి ఓ రేంజ్‌ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక జబర్దస్త్ ద్వారా పేరు సంపాదించి.. సినిమాల్లో అవకాశాలు సంపాదించిన ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అదే విధంగా సినిమాల్లో అవకాశాలు తగ్గి.. ఈ షో ద్వారా ఉపాధి పొందుతున్నవారు కూడా ఉన్నారు. అయితే ఈ షో ద్వారా సూపర్ ఇమేజ్ సంపాదించుకున్న వ్యక్తుల్లో సుడిగాలి సుధీర్ ముందు వరసలో ఉంటారు. ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్‌ కూడా ఓ రేంజ్‌లో ఉంది. కేవలం కమెడియన్‌గానే కాకుండా హోస్ట్‌గా కూడా సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం ఇతగాడు ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో చేస్తున్నాడు. అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్ నుంచి అందుతోన్న సమాచారం ఏంటంటే.. సుధీర్ జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పాడట.

మల్లెమాల ప్రొడక్షన్స్ ప్రతి ఏడాది కమెడియన్స్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది. ఆ నియమ నిబంధనలు విషయంలో పక్కాగా ఉంటుంది. జబర్దస్త్‌లో చేస్తున్నవాళ్లు.. వేరే టీవీ షోల్లో చేయకూడదనే నిబంధన కూడా ఉంది. ఈ అగ్రిమెంట్ బ్రేక్ చేసిన ముక్కు అవినాష్… మల్లెమాల ప్రొడక్షన్‌కు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాడు. ఈ క్రమంలో ఈ సారి సుడిగాలి సుధీర్ అగ్రిమెంట్ కొనసాగించడానికి ఆసక్తి చూపించడం లేదు అని తెలుస్తోంది.  ప్రస్తుతం సుధీర్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. దాంతో పాటు కమెడియన్‌గా కూడా చాలా సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇటు షోను.. అటు సినిమాలను బ్యాలెన్స్ చేయలేక  అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాడని సమాచారం. నెట్టింట వైర‌ల్ అవుతున్న ఈ వార్త‌ల‌పై ఇటు సుడిగాలి సుధీర్ నుంచి కానీ .. అటు జబర్దస్త్ యాజమాన్యం కానీ వివ‌ర‌ణ వస్తుందేమో చూడాలి మ‌రి.

Also Read: TSRTC MD Sajjanar: సజ్జనార్ నోటీసులు.. దిగొచ్చిన రాపిడో…

అదిరిపోయిన అయ్యగారి అభిమాని డ్యాన్స్.. కింగ్ సాంగ్‌కు ఊరమాస్ స్టెప్పులు

Loading...
Unable to load recommendations.
Follow Us