చెర్రీకి జోడిగా అలియానేనా..?..సాంగ్ తో రెడీనా..?

జ‌క్క‌న్న‌ రాజమౌళి మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. తెల‌గు చిత్ర‌సీమ‌లో కుటుంబ లెగసీ ఉన్న ఇద్ద‌రు స్టార్ హీరోలు క‌లిసి న‌టిస్తుండ‌టంతో చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇటీవ‌లే బర్త్ డే సంద‌ర్భంగా చ‌ర‌ణ్ వీడియోను తార‌క్ వాయిస్ ఓవ‌ర్ తో ఓ ఇంట్రో వీడియోని రిలీజ్ చేసిన జ‌క్క‌న్న సినిమా ఎలా ఉండ‌బోతుందో రుచి చూపించాడు. వచ్చే ఏడాది జనవరి 8న […]

చెర్రీకి జోడిగా అలియానేనా..?..సాంగ్ తో రెడీనా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 03, 2020 | 3:17 PM

జ‌క్క‌న్న‌ రాజమౌళి మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. తెల‌గు చిత్ర‌సీమ‌లో కుటుంబ లెగసీ ఉన్న ఇద్ద‌రు స్టార్ హీరోలు క‌లిసి న‌టిస్తుండ‌టంతో చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇటీవ‌లే బర్త్ డే సంద‌ర్భంగా చ‌ర‌ణ్ వీడియోను తార‌క్ వాయిస్ ఓవ‌ర్ తో ఓ ఇంట్రో వీడియోని రిలీజ్ చేసిన జ‌క్క‌న్న సినిమా ఎలా ఉండ‌బోతుందో రుచి చూపించాడు. వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఇప్పటి వరకు ఇందులో హీరోయిన్‌గా ప్ర‌క‌టించిన‌ అలియాభట్ చిత్రీకరణలో పాల్గొనలేదు.

దీంతో అలియా మూవీ నుంచి తప్పుకుందని, రాజమౌళి మరో హీరోయిన్ కోసం సెర్చింగ్ ప్రారంభించారని రూమ‌ర్స్ వ్యాపించాయి. అయితే అవన్ని జ‌స్ట్ పుకార్లేనని, అలియాభట్ మూవీలో న‌టిస్తుంద‌ని యూనిట్ ఇన్ డైరెక్ట్ గా అనౌన్స్ చేసింది. చరణ్‌, అలియాపై ఓ పాటతో సినిమా షూటింగ్ రీ స్టార్ట్ చేయ‌బోతున్నార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ నుంచి స‌మాచారం అందుతోంది.