Bigg Boss 5 Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేది ఎవరో తెలుసా..

బిగ్ బాస్ సీజన్ 5 రసావత్రరంగా సాగుతుంది. ప్రస్తుతం హౌస్‌లో 18 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరి మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుంది.

Bigg Boss 5 Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేది ఎవరో తెలుసా..
Bigg Boss

Updated on: Sep 19, 2021 | 8:21 AM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 రసావత్రరంగా సాగుతుంది. ప్రస్తుతం హౌస్‌లో 18 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరి మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుంది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులు ఇంటి సభ్యులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇక ఈ వారాం ఎలిమినేషన్ ఉండటంతో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారన్నది ఆసక్తిగా మారింది. గత వారం సరయు హౌస్ నుంచి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. జెస్సీ ఎలిమినేట్ అవుతాడని అనుకున్న సమయంలో అనూహ్యంగా సరయు బయటకు వచ్చేసింది. బయటకు రావడమే కాదు హౌస్‌లో ఉన్న మిగిలిన వారిపై సంచలన కామెంట్లు కూడా చేసింది. ఇక ఈ వారం హౌస్ నుంచి ఓ కంటెస్టెంట్ బయటకు రావడం పక్కగా కనిపిస్తుంది. ప్రేక్షకులు కూడా ఈ వారం ఆమె బయటకు వస్తుందని అంటున్నారు. ఆమె ఎవరంటే..

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నవారిలో సీనియర్ ఎవరైనా ఉన్నారంటే అది ఉమాదేవి అనే చెప్పాలి. హౌస్‌లో అన్ని పనులు చేస్తూ చాల చలాకీగా ఉండే ఉమాదేవి ఈసారి బయటకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. నిజానికి షో స్టార్టింగ్ నుంచి ఉమ చాలా అగ్రిసివ్‌గా ఉంటూ వచ్చింది. చిన్న చిన్న విషయాలకు కూడా అనవసరంగా ఆమె సీరియస్ అవుతుందని ప్రేక్షకులు కూడా అంటున్నారు.  ఈ క్రమంలో హౌస్‌లో కొన్ని సందర్భాల్లో బూతులు – అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారు. ఇవే ప్రేక్షకులకు ఇబ్బందిగా అనిపించి ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. దాంతో ఈ వారం హౌస్ నుంచి ఉమాదేవి బయటకు రావడం ఖాయమని తెలుస్తుంది. శనివారం అల్లరిచేస్తూ సందడి చేసిన హౌస్ మేట్స్‌కు ఆదివారం నాగ్ సీరియస్ వార్నింగ్ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. అలాగే ఉమా దేవి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి కామెంట్స్ చేస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: అమ్మబాబోయ్ ఇంత డ్రామా ఆడిందా.. వీడియో ప్లే చేసి మరీ సిరి బండారం బయటపెట్టిన నాగార్జున..

Love Story: పొలాండ్‌ కుర్రాడి నోట లవ్‌ స్టోరీ పాట.. కుర్రాడి డెడికేషన్‌కు ఫిదా అవ్వాల్సిందే.

Samantha Fan Tattoo: సమంత నా ఫస్ట్ లవ్ అంటూ అభిమాని చేతిపై టాటూ తో ఫోటోలు విడుదల…

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..